Home News Stories

కేసీఆర్ మ్యానిఫెస్టో రెస్పాన్స్ ఇదేనా…!

SHARE

కేసీఆర్ ఎన్నికల హామీల పై ప్రజా స్పందన ఎలా ఉంది.   ప్రకటన తర్వాత ప్రజల ప్రతిస్పందనపై టీఆర్ఎస్ దృష్టి సారించిందా? విపక్షాలు కుప్పలుతెప్పలుగా ఇస్తున్న హామీలకు దీటుగా తమ మేనిఫెస్టో అంశాలున్నాయని గులాబీ పార్టీ హింట్ ఇచ్చిందా ? మొత్తం మేనిఫెస్టో విడుదలైతే విపక్షాల పరిస్థితి ఏంటన్న దానిపై టీఆర్ఎస్ అంచనాలు ఎలా ఉన్నాయి ఇంకా బయటకి రాని భారీ పథకాలు ఏంటీ….

ఒక వైపు తమ పార్టీ అభ్యర్దుల ప్రచారం కొనసాగుతుండగా … మరోవైపు విపక్షాలు ప్రజాకర్షక పథకాలపై హమీలు గుప్పిస్తూ జనంలోకి వెళ్తుండటంతో … టిఆర్ఎస్ వ్యూహం మార్చుకుంది .. వాస్తవానికి దసరా తర్వాత పూర్తి స్థాయి మ్యానిఫెస్టోను ప్రకటించాలని టిఆర్ఎస్ భావించింది .. అయితే ఒకవైపు విపక్షాల హామీల వర్షం.. తమ అభ్యర్ధులు ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్‌లను దృష్టిలో పెట్టుకుని…పాక్షికంగా మ్యానిఫెస్టోను ప్రకటించింది…


లక్ష రుపాయల రుణమాఫీ , పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి , రైతుబంధు సహయం పెంపు , డబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం నిబంధనలకు సంబంధించిన సడలింపులను కేసిఆర్ ప్రకటించారు .. అలా విపక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టడానికి అన్నట్లు ముందుగా పలు హమీలను ప్రకటించింది కారు పార్టీ. మోత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను మించే స్థాయిలో ప్లాన్ సిద్దం చేసుకుంది టీఆర్ఎస్.

కేసిఆర్ హమీలు ప్రకటించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో వస్తున్న స్పందనపై ఆరా తీయడం మొదలపెట్టింది గులాబీ దళం .. పాక్షికంగా ప్రకటించిన హమీలతోనే ప్రజల నుంచి పాజిటివ్ స్పందన వస్తుందని …ఇది ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ కి కలిసి వస్తుందన్న అంచనాకు వస్తున్నారు అధికారపక్ష నేతలు విపక్షాల హమీలను ప్రజలు నమ్మడం లేదని … ప్రస్తుత పరిస్థితుల్లో కేసిఆర్ ప్రకటించిన పలు హమీలను ప్రజలు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారని టిఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి .. ఆ క్రమంలో ఇప్పటికే టిఆర్ఎస్ గెలుపు ఖాయం అన్న నమ్మకంతో ఉన్న పార్టీ వర్గాలు … తాజా హమీలతో టిఆర్ఎస్ గెలిచే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నాయి.

పాక్షిక మ్యానిఫెస్టోతో తమ అభ్యర్ధుల ప్రచారానికి ఊతం దొరికిందని భావిస్తున్న టిఆర్‌ఎస్‌ .. పూర్తి స్థాయి మ్యానిఫెస్టోపై కసరత్తు ముమ్మరం చేసింది… ఎస్సీ , ఎస్టీలతో పాటు మహిళలను ఆకట్టుకునేలా పూర్తిస్థాయి మ్యానిఫెస్టోలో హమీలు పొందుపరిచే అవకాశం ఉంది… ఏదేమైనా టిఆర్ఎస్ పూర్తి మ్యానిఫెస్టో విడుదల అయితే తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలు ఫినిష్ అవుతాయని ఆ పార్టీ వర్గాలు స్టేట్‌మెంట్లు ఇస్తుండటం కొసమెరుపు..