Home News Politics

కేసీఆర్ లెజండరీ మ్యాన్, కాని నేను మాత్రం కాంగ్రెసే…..

SHARE

ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణలోని పలు పార్టీల్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు తలో దారి వెతుక్కుంటున్నారు రాజకీయ ఆశాపరులు. కాని వారికి ఉన్న వ్యాపార ఈతరాత్ర వ్యవహారాలతో ప్రత్యర్ధి పార్టీలను విమర్శించే విధానం పై క్లారిటీ మిస్ అవుతున్నారు ఈ నయా పొలిటికల్ లీడర్స్. వీరి చేరికలతో పార్టీలకు ఈసుమంత ప్రయోజనం అన్న ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న….

బండ్ల గణేష్ నిన్నటి వరకూ సినీ నిర్మాత.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేత. తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏకంగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన అభిమాన – ఆరాధ్య దేవుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లో చేరి బండ్ల గణేష్ అందరినీ షాక్ కి గురి చేశాడు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ప్రతిపక్ష టీఆర్ ఎస్ ను విమర్శించాలి. కేసీఆర్ ను తిట్టాలి. ఇదే విషయాన్ని ఒక చానల్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా షాకింగ్ అన్సర్ ఇచ్చాడు బండ్ల గణేశ్.

ఇంకా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి నాకెక్కడిది సార్..’ అంటూ తన భయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడిగా కేసీఆర్ ను విమర్శించరా అని ప్రశ్నించగా దీనికి బండ్ల ‘‘కేసీఆర్ గారి స్థాయి ఏంటి.? అతను లెజండరీ మ్యాన్..ఆయన్నెందుకు విమర్శిస్తాను.. అంటూ తప్పించుకున్నారు. కేసీఆర్ గారు బాగా చేయకపోతేనే కాంగ్రెస్ తరఫున తాము పోరాడుతామంటూ బొంకాడు. లెజండరీ కేసీఆర్ బాగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు తిడతారు అంటూ యాంకర్ కౌంటర్ ఇవ్వగా కేసీఆర్ పాలన జనానికి అందడం లేదు.. ఉపయోగపడడం లేదు.. జనాలు విరక్తి చెంది ఉన్నారంటూ సింపుల్ గా మాట మార్చేశాడు బండ్ల గణేశ్.

పవన్ కళ్యాణ్ అంటే ఊగిపోయే భక్తుల్లో ఒకరైన బండ్ల గణేష్ ‘కాంగ్రెస్ కే హఠావో.. దేశ్ కో బచావో’ అంటూ మీరు దేవుడుగా కొలిచే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించారు కదా అంటే బండ్ల గణేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. దీనికి బండ్ల.. పవన్ అలా ఎప్పుడూ అనలేదని బుకాయించాడు. ఒకవేళ అంటే అనుండొచ్చు. పవన్ గురించి మాట్లాడే స్థాయి నాకు లేదంటూ మెల్లిగా తప్పించుకున్నారు.

తాను కాంగ్రెస్ లో చేరినప్పుడే చావుకు భయపడలేదని.. అధికార పక్షం కేసులు పెట్టినా.. జైలుకు పంపినా.. చంపేసినా తాను రెడీ అంటూ భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన భక్తిని వ్యక్తం చేశాడు ఈ కాంగ్రెస్ లీడర్ కమ్ మువీ ప్రోడ్యూసర్.