Home News Politics

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప‌గ‌టిక‌లేనా?

బీజేపీకి వ్య‌తిరేక‌మైతేనే వ‌ర్క‌వుట్‌

SHARE

త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌తో జాతీయరాజ‌కీయాల్లో బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లైపోతుంద‌న్న కేసీఆర్ ఆలోచ‌న ప‌గ‌టిక‌ల‌గానే మిగిలిపోయేలా ఉంది. మ‌బ్బుల్నిచూసి ముంత ఒల‌క‌బోసుకున్న‌ట్లు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను చూసుకుని రాష్ట్రాన్ని వ‌దిలేస్తే అది కేసీఆర్‌కి న‌ష్టం చేకూర్చ‌డం ఖాయం.

అఖిలేష్‌యాద‌వ్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడే త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌నుంచి రాజ‌కీయ‌ప‌క్షాలు ఏం ఆశిస్తున్నాయో కేసీఆర్‌కి తెలిసొచ్చిఉండాలి. దేశ‌మంతా ఇప్పుడు యాంటీమోడీ పాలిటిక్స్‌కే విప‌క్ష‌పార్టీలు మొగ్గుచూపిస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కేవ‌లం కాంగ్రెస్‌పైనే గురిపెడితే ప‌రోక్షంగా బీజేపీ త‌ప్ప మ‌రే పార్టీ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కి క‌లిసొచ్చే అవ‌కాశ‌మేలేదు.

మ‌మ‌తాబెనర్జీని కేసీఆర్ క‌లుసుకున్న స‌మ‌యంలో పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు న‌డుస్తున్నాయి. ఎన్డీఏ స‌ర్కారుపై అవిశ్వాసం చ‌ర్చ‌కు రాకుండా అల్ల‌రి చేస్తున్న అన్నాడీఎంకే స‌భ్యుల‌తో టీఆర్ఎస్ ఎంపీలు క‌లిసిపోయారు. అందుకే తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి ఆయ‌న్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు. త‌ర్వాత కేసీఆర్ క‌లిసొచ్చిన దేవెగౌడ‌ని ఇప్పుడు మోడీ దువ్వుతున్నారు. బీజేపీతో క‌లిసిపోతే కొడుక‌ని కూడా చూడ‌కుండా కుమార‌స్వామిని కుటుంబంనుంచి బహిష్క‌రిస్తాన‌న్న దేవెగౌడ ఇప్పుడా విష‌యంలో మెత్త‌బ‌డ్డ‌ట్లే క‌నిపిస్తోంది. ఇక డీఎంకే అధినేత‌ను వెళ్లి క‌లిసినా…డీఎంకే ఏ హామీ ఇవ్వ‌లేదు. ఇప్పుడు క‌నిమొళి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తోనే క‌లిసి ప‌నిచేస్తామ‌ని చెప్పుకొచ్చింది. సో అటువైపేనుంచి కూడా మొండిచేయే.

ఈమ‌ధ్య కేసీఆర్‌ని క‌లిసివెళ్లిన అఖిలేష్‌యాద‌వ్ యూపీలో బీజేపీని ఓడించ‌డానికి ఉప ఎన్నిక‌ల్లో బీఎస్పీతో చేతులు క‌లిపారు. శాస‌న‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల విష‌యంలోనూ అదే స్ట్రాట‌జీ ఫాలో కాబోతున్నారు. ఓ ప‌క్క తోటి తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంమీద పోరాడుతుంటే….త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి ఇప్ప‌టిదాకా టీడీపీ అధినేత‌తో కేసీఆర్ చ‌ర్చించింది లేదు. దేవెగౌడ‌ని క‌లిసిన సంద‌ర్భంలో ఆ ప్ర‌స్తావ‌న రావ‌టంతో చంద్ర‌బాబు మంచి మిత్రుడ‌నే ప్ర‌క‌ట‌న‌కే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప…ఆ దిశ‌గా ఆయ‌న ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏపీకి ద్రోహం చేశాయంటున్న చంద్ర‌బాబుకంటే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కి క‌లిసొచ్చే నాయ‌కుడు మ‌రెవ‌రుంటారు?

దేశ‌మంతా ఇప్పుడు మోడీకి వ్య‌తిరేక రాజ‌కీయ‌మే న‌డుస్తోంది. ఎన్డీఏ నుంచి త‌ప్పుకున్న శివ‌సేన కూడా మోడీపై దుమ్మెత్తిపోస్తోంది. మ‌ళ్లీ మోడీతో క‌లిసినందుకు ఇప్ప‌టికే నితీష్‌కుమా