Home Entertainment Cinema

కన్నడ ‘రెబల్ స్టార్’ ఇక లేరు

SHARE

కన్నడ ప్రజల గుండె బరువెక్కింది.సినీ , రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాదించుకున్న అంబరీశ్ మరణ వార్తతో బెంగుళూరులో విషాద చాయలు అలముకున్నాయి. ఆయనతో సన్నిహితం కొనసాగించిన అభిమానులు , ప్రముఖులు అంబరీశ్ పార్దవ దేహానికి నివాళి అర్పించారు. ప్రకాశ్ రాజ్,రజనీకాంత్,కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి,చిరంజీవి,మోహన్ బాబు ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తరలి వచ్చిన శ్రద్దాంజలి ఘటించారు.కన్నడ చలన చిత్ర రంగంలో స్టార్ డమ్ తో కెరీల్ లో ప్రత్యేక స్ధానంతో పాటు రాజకీయంగా అటు మంత్రి హోదాలో అంబరీశ్ చేసిన సేవలను కొనియాడారు.

మాస్ లీడర్ గా ఆయన చేసిన క్యారక్టర్స్ చిత్ర సీమలో పదిలంగా ఉంటాయని ప్రముఖులు అంబరీశ్ తో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంటూ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంజలి ఘటించారు. తనతో ఆకరిసారిగా నటించిన సుహాసిని తన మాటలను నెమరివేసుకున్నారు, ఇక కడసారి చూసేందుకు అభిమానులు సుమారు 2 లక్షలకు పైగా హాజరయ్యారు…


తండ్రి అడుగు జాడల్లో తనయుడు నడుస్తాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కన్న చలన చిత్ర రంగంలో అభిషేక్ అంబరీశ్ చిత్ర రంగంలోకి అడుగు పెట్టి ఏడాది గడుస్తోంది.కధానాయకుడిగా కొనసాగుతూ రాజకీయ రంగంలోనూ అడుగు పెడతారా అన్నది ఇప్పుడు కన్నడ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్న అంశంగా మారుతోంది.ఈ క్రమంలో రేపు ఉదయం మాండ్యా జిల్లాలో జైనగర్ లో ఉన్న ఆయన స్వగృహంలో అభిమానుల సందర్శించడం కోసం ఉంచుతారు.అనంతరం కాంటీరవ స్టూడియో లో దహన సంస్కారం జరుగుతుంది…