Home News Politics

కమలం గూటికి కమెడియన్…

SHARE

సినీ జీవితం నుంచి సైకిలెక్కిన ఆ నేత ఎమ్మెల్యే అయ్యారు. కాలం కలిసి వచ్చి సామాజిక వర్గం ప్లస్ అవ్వడంతో ఏకంగా ఆమాత్య పదవి వరించింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడటం. తనకు బ్రేక్ ఇచ్చిన పార్టీ బ్రేకులు ఫెయిలవ్వడంతో సైకిల్ దిగి కారెక్కారు.

ప్రముఖ నటుడు, మాజీ మంత్రి,ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ పోలిటికల్ లైఫ్ సందిగ్దంలో పడింది. ఫస్ట్ లిస్ట్ లో గులాబీ బాస్ టిక్కెట్ నిరాకరించడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. లాస్ట్ మినిట్ లో గత ఎన్నికల్లో కారు పార్టీ టిక్కెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయిన బాబుమోహన్ తన వ్యవహారశైలితో వివాదస్పదుడయ్యాడు. దీంతో ఈసారి టిక్కెట్ ఇవ్వడానికి సీఎం కెసిఆర్ నో అన్నారు.


కానీ సదరు నేత దిన్ని ప్రస్టేజ్ ఇష్యూగా తీసుకుని మరోసారి ఆందోల్ అభ్యర్ధిగా తాను పోటిచేయాలని చూస్తున్నాడు. హస్తం పార్టీ వేపు చూస్తే తన చిరకాల ప్రత్యర్ధి, ఆ పై మాజీ డిప్యూటీ సీఎం అక్కడ చాన్స్ లేదు. ఈ క్రమంలోనే బాబుమోహన్ కమలం గూటికి చేరేందుకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్.

బాబూ మోహన్ బిజెపి అభ్యర్ధి అయితే ఆయన గెలుపు సంగతి ఎలా ఉన్నా, టిఆర్ఎస్ ఓటమికి మాత్రం తాను ఖచ్చితంగా కారణమవుతాడన్న టాక్ రాజకీయ విశ్లేషకుల నుంచి విపిస్తుంది.