Home News Politics

వైసీపీకి పాల్ పరేషాన్…!

SHARE

ప్రజాశాంతి పార్టీ హెలికాఫ్టర్ గుర్తుతో ఓటర్లకు కన్ఫ్యూజన్ ఉంటుందని భావిస్తున్న వైసీపీ.. ఓట్లు చీలకుండా జాగ్రత్త పడుతోంది. ఫ్యాన్ గుర్తును ఓటర్లకు చేర్చడానికి అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటోంది. దీని కోసం వైసీపీ అమలు చేస్తున్న గేమ్ ప్లాన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్న వైసీపీకి..పాల్ పార్టీ దెబ్బ పడుతుందని ఆందోళన పెరిగిపోతోంది. దాదాపు 35 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంచుమించుగా ఒకేలా ఉండంతో, పార్టీ గుర్తులు కూడా దగ్గరదగ్గరగా ఉండటంతో..ఆ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. ప్రతినియోజక వర్గంలో అయిదు నుంచి పది వేల ఓట్లు చీలతాయని వైసీపీ లెక్కలేస్తోంది . ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల తో పాటు ఆ పార్టీ కి కేటాయించిన హెలికాఫ్టర్ రెక్కల గుర్తును మార్చాలని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే నామినేషన్ ల ప్రక్రియ ముగియడంతో..అన్నిపార్టీల అభ్యర్థులు జాబితాను ఈసీ ప్రకటించింది. ఇప్పుడు పాల్ పార్టీ గుర్తుపై ఈసీ యాక్షన్ తీసుకుంటుందా..లేదా అనేది అనుమానమే.

ప్రచారానికి పదకొండు రోజులే సమయం ఉండటం తో.. ఫ్యాన్ గుర్తును జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వైసీపీ డిసైడైంది. విజయవాడ,హైదరాబాద్ ఆఫీసుల నుంచి ఫ్యాన్ గుర్తులున్న కీ చైన్లు, బ్యాడ్జిలను..మ్యానిఫెస్టోతో కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. మూడు రోజుల్లో విడుదల చేసే నాలుగు పేజీల మ్యానిఫెస్టోతో కలిపి వీటిని ఓటర్లకు చేర్చాలని భావిస్తున్నారు. ఫ్యాన్ గుర్తును పోలి ఉన్న హెలికాప్టర్ గుర్తును..గ్రామాల్లో ఎల్ ఈ డి తెరలపై ప్రచారం చేయాలని వైసీపీ నిర్ణయించింది.

వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను వెతికి మరి పోటీకి దించారు. ఈ విధంగా నామినేషన్ల పర్వం చివరి రోజున ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి తిరకాసుకు పాల్పడ్డారు. అలాగే ఈవీఎంలో వైసీపీ గుర్తు కిందే హెలికాఫ్టర్ గుర్తు వచ్చేలా పాల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ 40స్థానాల్లో స్వల్ప మెజారిటీతో అధికారం కోల్పోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశాన్ని వదులుకోవద్దని పట్టుదలగా ఉన్న వైసీపీకి పాల్ పార్టీతో తలనొప్పి మొదలైంది. అందుకే ఫ్యాన్ గుర్తున్న వస్తువులను రాష్ట్రవ్యాప్తంగా పంచుతోంది వైసీపీ .

వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న ప్రజాశాంతి అభ్యర్థులు వీరే:

రాయదుర్గం- కాపు రామచంద్రారెడ్డి (వైసీపీ), ఉండాల రామచంద్రారెడ్డి (ప్రజాశాంతి)

ఉరవకొండ- విశ్వేశ్వర్‌రెడ్డి (వైసీపీ), కె.విశ్వనాథ్ రెడ్డి (ప్రజాశాంతి)

అనంత అర్బన్- అనంత వెంకట్రామిరెడ్డి (వైసీపీ), పగడి వెంకటరామిరెడ్డి (ప్రజాశాంతి)

కళ్యాణదుర్గం- ఉషాశ్రీ చరణ్ (వైసీపీ), ఉషారాణి నేసే ( ప్రజాశాంతి)

రాప్తాడు- తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (వైసీపీ), డి ప్రకాశ్ (ప్రజాశాంతి)

పెనుకొండ- ఎం.శంకర్ నారాయణ(వైసీపీ), ఎస్.శంకర్ నారాయణ (ప్రజాశాంతి)

ధర్మవరం- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (వైసీపీ), పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డి (ప్రజాశాంతి)

కదిరి- సిద్దారెడ్డి (వైసీపీ), సన్నక సిద్దారెడ్డి (ప్రజాశాంతి