Home News Stories

జర్నలిస్ట్ కొమ్మినేని కి తీరని శోకం…

SHARE

సాక్షీ టీవీలో గత వారం రోజులుగా కొమ్మినేని షో మిస్ అయిది. ఆ సమయంలో వేరే యాంకర్ తో డిబేట్లు వస్తున్నాయి కాని ఆయన కనిపించటంలేదు. ఏమై ఉంటుంది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని సాక్షి కి గాని గుడ్ బై చెప్పాడా అని సాక్షి సగటు ప్రేక్షకుడు కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు.

గతంలో చంద్రబాబు, లోకేశ్ పుణ్యమా అని ఎన్టీవీ నుంచి బయటకు వచ్చిన కొమ్మినేని కి జగన్ చేయుత అందిచి సాక్షి లో కీలక పోస్టు ఇచ్చాడు. జర్నలిస్టులతో మంచి సంబంధాలు,స్నేహాలు ఉన్న కొమ్మినేని సడన్ గా సాక్షి స్క్రీన్ మీద మాయం అవ్వడానికి కారణం ఏంటి మరి ? అని మీడియా సర్కిల్స్ లో డిష్కషన్ నడుస్తుంది. కాని కొమ్మినేని ఇంట పెను విషాదం జరిగిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్థుతం కొమ్మినేని కెనడాలో ఉన్నట్లు తెలిసింది.

కొమ్మినేని ఎకైక కుమారుడు శ్రీ హర్ష కొన్నాళ్ళుగా కెనడాలో జాబ్ చేస్తున్నారు. కొన్ని నెలలుగా శ్రీ హర్ష క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. కెనడాలోనే ట్రీట్ మెంట్ తీసుకుంటూ అక్కడే నివసిస్తున్నాడు. ఈ మధ్య అది సీరియస్ కావడంతో కొమ్మినేని కుటుంబం కొడుకు దగ్గరకు కెనడా వెళ్ళింది. కాని అప్పటికే చేదాటిపోవడంతో శ్రీహర్ష మృతి చెందాడు. ఈనాడు,ఆంద్రజ్యోతి,ఎన్ టీవీ,సాక్షీ లో జర్నలిస్టుగా పలు కీలక స్థానాల్లో పని చేసిన కొమ్మినేని కొండత అండైన కుమారున్ని కొల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు