Home News Updates

ఈనెల 13న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ!!!

ఈ నెల 13న హైదరాబాద్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌లు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు రెండు రాష్ర్టాల విభజన సమస్యల పరిష్కారంపై చర్చించనున్నట్లు సమాచారం.

నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ర్టాల సీఎంలు సమావేశమై పలు అంశాలపై చర్చించిన విషయం విదితమే…