Home News Politics

జనసేన ఒరలో మరో చానల్…

SHARE

రాజకీయ పార్టీలకు,మీడియాకు ఉన్న రిలేషన్ వేరే చెప్పనక్కర్లేదు. ప్రతి పొలిటికల్ పార్టీ తనకు సపోర్ట్ గా బలమైన మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. మీడియా,పొలిటికల్ పార్టీల రిలేషన్ లో ఫస్ట్ ప్లేస్ తమిళనాడుదే. ఇక తెలుగు రాష్ట్రాల్లో కుడా అరవ రాజకీయాలను మించిన ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు కూడా తమకు బలమైన మీడియా వ్యవస్థ వెన్నుదన్ను గా ఉండాలని భావిస్తున్నాయి. ఇదే కొవలో జనసేన కూడా ప్లాన్ సిద్దం చేసుకుంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా బలం మరింత పెరగనుంది. ఇప్పటికే ఓ తెలుగు పత్రిక – మరో జాతీయ ఛానల్ – ఓ ప్రాంతీయ ఛానల్ మద్దతుతో పవన్ దూసుకుపోతుండగా… ఇంకో టీవీ ఛానల్ త్వరలో యాడ్ కానుందనే వార్తలు మీడియా హౌస్ ల్లో గుప్పుమంటున్నాయి.. పవన్ పార్టీకి మద్దతుగా టీవీ చానల్ ను ఓ ఎన్నారై ప్రారంభించచున్నారనే వార్తలు అప్పట్లో షికారు చేశాయి.. ఈ వార్తలను నిజం చేస్తూ ఈ దసరాకు టెస్ట్ సిగ్నల్ అందుబాటులోకి వచ్చేసింది.


మాజీ ఐఏఎస్ జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ సీపీఐ నేతల చేతుల్లో ఉన్న 99 టీవీ ఛానల్ ను పవన్ పార్టీకి మద్దతుగా ఉండేందుకు కొనుగోలు చేశారు. అలా జనసేనకు పరోక్షంగా ఓ మీడియా చానల్ వచ్చింది. ఇది జరిగిన కొద్దికాలానికి మాజీ మంత్రి ముత్తాగోపాలకృష్ణ జనసేన గూటికి చేరారు. తద్వారా వారి చేతుల్లో ఆంధ్రప్రభ పత్రిక మద్దతు ఇస్తోంది. ఇక గౌతమ్ ఆధ్వర్యంలో ప్రారంభం అవుతున్న ఇండియా హేడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ లో ఒక కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ హోస్ట్ గా రూపకల్పన చేశారని తెలుస్తుంది. ఆ కార్యక్రమంలో చేయడానికి అంగీకరించాల్సిందిగా వారు కొద్దికాలం కిందట పవన్ ని కోరగా ఈ టీవీషో చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకారం తెలిపారు.

దీంతో పవన్ కి మద్దతుగా ఓ పత్రిక, మరోజాతీయ ఛానల్ తోడయ్యాయి. ఇప్పుడు పవన్ పై ఉన్న వీరాభిమానంతో ఓ ఎన్నారై తన దగ్గరున్న డబ్బుతో ‘ప్రైమ్9’ న్యూస్ పేరుతో ఈ ఛానెల్ పెట్టారు. ఇప్పటికే టెస్ట్ సిగ్నల్ మొదలైంది. దసరా నాడు టెస్ట్ సిగ్నల్ వచ్చిన ఈ ఛానల్ పవన్ కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. జనసేనానితో ప్రత్యేకంగా ఫోన్ ఇన్ ప్రోగ్రాం పెట్టనున్నట్లు చెబుతున్నారు. జనసేన భావజాలాన్ని పెద్ద ఎత్తున చాటిచెప్పేందుకు ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోనున్నట్లు సమాచారం.