Home News Politics

గోదావరి జిల్లాల్లో జనసేనలోకి క్యూ కట్టేది వీరేనా…?

SHARE

గోదావరి జిల్లాలో జనసేనలోకి నేతల వలసలు కొనసాగనున్నాయా..అధినేత పవన్ గోదావరి జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశాడా…పవన్ తరచూ తూర్పు గోదావరి జిల్లాలో ఎందుకు పర్యటిస్తున్నాడు. జనసేన ఇక్కడ ఏ పార్టీకి గండి కొట్టబోతుంది…గోదావరి జిల్లాల్లో జనసేన స్కెచ్ ఏంటీ… సీ దిస్ స్టోరీ

గోదావరి జిల్లాల్లో జనసేన లోకి పేరున్న నేతలంతా ఒకేసారి వెళ్ళెందుకు సిద్ధం అవుతున్నారా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా ఒకేసారి బడా నేతలు వెళితే పార్టీకి మరింత హైప్ వస్తుందని వీరంతా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలు మరో మూడు, నాలుగు నెలలు మాత్రమే ఉండగా తమ కొత్త రాజకీయ నిర్ణయాన్ని వీరు ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్యెల్యేలు ఇద్దరు, ఇద్దరు మాజీ ఎంపీలు జనసేన జండా కట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లాలో టాక్ నడుస్తుంది.

మాజీ పార్లమెంట్ సభ్యులు జీవీ హర్ష కుమార్, ముద్రగడ పద్మనాభం, సిట్టింగ్ ఎమ్యెల్యే లైన ఆకుల సత్యనారాయణ, తోట త్రిమూర్తులు జనసేన బాట పట్టడం ఖాయమనే అంచనా పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే హర్ష కుమార్ జనసేన లోకి వెళ్లేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకోగా…. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎప్పుడు వెళతారు ? వెళ్ళే అవకాశాలు లేవా అన్నది త్వరలోనే తేలనుంది. ఆయన కూడా జనసేన లోకే వెళ్లడం ఖాయమంటున్నారు ఆయన సన్నిహితులు.

ఇక రామచంద్రపురం సిట్టింగ్ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు సైతం చివరి వరకు తెలుగుదేశంలో ఉండి జనసేన లోకి జంప్ చేయడం గ్యారంటీ అంటున్నారు. ఇటీవల పవన్ సైతం రామచంద్రపురం లో బహిరంగ సభ నిర్వహించి తోట త్రిమూర్తులను పల్లెత్తు మాట అనలేదు. ఇక రాజమండ్రి బీజేపీ ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ సైతం జనసేన లో చేరికకు సరైన ముహూర్తం కోసం వేచి చూస్తున్నారని చెబుతున్నారు. పవన్ సమక్షంలో వీరంతా ఒకేసారి చేరడం ద్వారా తూర్పు రాజకీయాల్లో ప్రకంపనలు తేవాలన్నది వ్యూహం అంటున్నారు. మరి దీనికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యంగా తెలుస్తుంది. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ మధ్య తరచు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ దీనికి సంభందించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అనూహ్యంగా గత రెండు రోజులుగా వైసీపీ అధినేత జగన్ పై కూడా తీవ్ర విమర్షలు చేస్తున్న పవన్ వ్యాఖ్యల వెనుక రాజకీయ ఫ్యూహం ఉందని ఆ పార్టీ సీనియర్ లీడర్స్ విశ్లేషిస్తున్నారు. పక్క పార్టీల నుంచి వలసలు ప్రోత్సహిస్తున్న జనసేనాని ఇక ఎంతమేరకు గోదావరి జిల్లాల్లో పట్టుసాధిస్తారో చూడాలి.