Home News Politics

జగన్ యాత్రకు ముగింపు ఎప్పుడు…తెలంగాణ ఎన్నికలకు జగన్ పాదయాత్రకి లింకేంటి…

SHARE

తెలంగాణ ఎన్నికలు ముగిసేవరకు ఏపీలో జగన్ పాదయాత్ర కొనసాగనుందా? మరికొద్ది రోజుల్లో ముగియాల్సిన జగన్ పాదయాత్ర పొడిగిస్తున్నారా ? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు… అసలు వైసీపీ అధినేత వ్యూహం ఏంటి? తెలంగాణ ఫలితాలు వచ్చే వరకు జనంలో ఉంటే తమకు ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారా?

తెలంగాణ లో ఎన్నికల భేరీ మోగడంతో .. ఆంధ్రలో తన పాదయాత్ర పొడిగించాలని ఆలోచనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది .. షెడ్యూల్‌ ప్రకారం పాదయాత్ర ముగించి .. తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని బస్ యాత్రకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది వైసీపీ.. ఏదేమైనా వచ్చే ఎన్నికల వరకు ప్రజాల్లోనే ఉండేలా జగన్ కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది..

దాదాపు 282 రోజులు 116 నియోజకవర్గాల్లో కొనసాగిన జగన్ పాదయాత్ర డిసెంబర్ చివరి వారం వరకు పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి…. వాస్తవానికి నవంబర్ 5తో ముగియాల్సిన తన పాదయాత్ర ను పొడిగించాలని వైసీపీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం జగన్ పాదయాత్ర 125 నియోజకవర్గాల్లో 307 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల సాగాల్సి ఉంది… ఇప్పటివరకు 116 నియోజకవర్గాల్లో, 282 రోజుల పాటు జగన్ తన పాదయాత్రలో 3100 కిలోమీటర్ల కవర్ చేశారు… అయితే తాజా రాజకీయ పరిణామాలతో ఈ పాదయాత్రను మరికొన్ని రోజులు పొడిగించాలని వైసిపి అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేవరకు పాదయాత్ర కొసాగిస్తే పార్టీ కి మేలు కలుగుతుందని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు డిసెంబర్ చివరి వారం వరకు తన పాదయాత్ర కొనసాగిస్తే బాగుంటుందనే ఆలోచనకు జగన్ వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి … దాంతో పాటు పాదయాత్ర ముగిసిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకొని మిగిలి 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు ఇప్పటికే జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్తున్నారు.

మే వరకు ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవడంతో అప్పటివరకు ఏదో ఒక రూపంలో ప్రజాల్లోనే ఉండాలని జగన్‌ ఫిక్స్‌ అయ్యారట.. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో కూడా ప్రభావం చూపుతాయని జగన్ బలంగా నమ్ముతునట్లు తెలుస్తుంది…. మొత్తమ్మీద వచ్చే నెలతో ముగుస్తుందనుకున్న జగన్ పాదయాత్ర డిసెంబర్ వరకు జగన్ పొడిగించడంతో ఏపీలో పొలిటికల్‌ హీట్‌ కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది..