Home News

ఆ ఐపీఎస్ పోస్టింగ్ కి అడ్డుపడుతున్నదెవరు…!

SHARE

రెండు రాష్ట్రాలు ఒకే అనుకున్నాయి. తెలంగాణకు చెందిన ఆ ఐపీఎస్ అధికారిని ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటేషన్‌పై పంపాలనుకున్నారు.. పరస్పర వగాహనతో ఉన్న సమయంలో ప్రాసెస్‌ లేట్ అవ్వడం ఇప్పుడు సదరు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది…ఆ ఐజీ స్టాయి అధికారి డిప్యూటేషన్ కి అడ్డుపడుతున్నదెవరు…. అధికారి బదిలీ విషయంలో ఇద్దరు సీఎంలు ఓకే అనుకున్నా … ప్రాసెస్‌ ఎందుకు లేట్ అవుతుందన్నది దీనికి అడ్డుపడుతున్నది ఎవరన్నది హాట్‌టాపిక్‌గా మారింది..


రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవ లేదు అంటారు పెద్దలు… ఎందుకంటే రాజు ఏది అనుకుంటే అది జరిగిపోతుంటుంది … వారి అవసరాలకు అనుగుణంగా ఒక పద్దతి ప్రకారం అన్నీ జరిగిపోతాయి … అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఐపిఎస్ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర డిప్యూటేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది… రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నప్పటికి సదరు అధికారి బదలీ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైంది.. ఇలా ఎందుకు జరుగుతోంది? సదరు అధికారి డిప్యూటేషన్ ఎందుకు ఆలస్యం అవుతుందన్నది అంతుపట్టకుండా తయారైంది డిపార్ట్‌మెంట్‌ కి…


ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలల్లో గెలిచి వైసిపి అధికారంలోకి వచ్చింది… ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ఆధికారుల బదలీ పక్రియ చేపట్టింది… అందులో భాగంగా కీ పోస్టుల్లో తమకు అనుకూలురైన అధికారుల కోసం అన్వేషణ ప్రారంభించింది .. అందులో భాగంగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా… ఆంధ్రా కేడర్‌కు చెందిన ఆధికారిని కాకుండా … తెలంగాణలో పనిచేస్తున్న ఆధికారిని నియమించుకోవాలని నిర్ణయించుకుంది …

తెలంగాణలో ఐజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రను ఏపి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించుకోవాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భావించింది .. దానిపై ఏపి సీఎం తెలంగాణ ముఖ్యమంత్రిని సంప్రదించారు .. స్టీఫెన్‌రవీంద్రను డిప్యూటేషన్‌పై తమ రాష్ట్రానికి పంపించాలని అడిగారు… అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా అంగీకరించారు… అయితే ఐపిఎస్‌ అధికారి డిప్యూటేషన్‌ అంటే… రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం అంగీకరించినప్పటీక… కేంద్ర ప్రభుత్వం అమోద ముద్ర వేయాల్సి వుంటుంది..
తన డిప్యూటేషన్‌ను కేంద్రం ఓకే చేస్తుందని ఐజీ స్టీపెన్ రవీంద్ర ఇప్పటికే తెలంగాణలో లీవ్ పెట్టి ఉన్నారు … దాదాపు నెలరోజుల క్రితం స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్ ఫైల్‌ను కేంద్రానికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం… అది ఇంకా ఓకే అవ్వలేదు.. డిప్యూటేషన్ ప్రాసెస్ పూర్తి కావడానికి దాదాపుగా తొంబై రొజుల సమయం పడుతుందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి… రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకరించినప్పటికీ .. అధికారికంగా రెండు రాష్ట్రాలు కేంద్రానికి లేటర్స్ ఇవ్వవలసి వుంటుందని చెబుతున్నారు… ఈ ప్రాసెస్ లో ఎక్కడ చిన్న తేడా వచ్చినా .. మరింత ఆలస్యం అయ్యే అవకాశం వుంటుందని ఆధికారులు తెలిపారు.


ఇదిలా వుంటే ఆంధ్రాకు ప్రస్తుతానికి ఇంటెలిజెన్స్ చీఫ్‌ అంటూ ఆధికారికంగా ఎవరూ లేరు … స్టీపెన్ వచ్చే వరకు కూడా ఆ పోస్టులో అక్కడి ప్రభుత్వం ఎవరినీ నియమించే పరిస్ధితి కనిపించడం లేదు .. మొత్తమ్మీద ఎక్కడ ఇబ్బంది వుందో తెలియదు కాని .. స్టీపెన్ రవీంద్ర డిప్యూటేషన్ ఫైల్‌కు కేంద్రం ఎప్పడు క్లియెరెన్స్ ఇస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు .. అందుకే ఈ డిప్యూటేషన్‌ ప్రక్రియ రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిందిప్పుడు..