Home Sports

టీమిండియాలో కోల్డ్ వార్…!

SHARE

సెమీస్ లో ఓటమితో టీమిండియా పై రోజుకొక కొత్త వార్త బయటికొస్తుంది. తాజాగా టీమిండియాలో ఉన్న గ్రూప్ గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెరో గ్రూప్ నడుపుతున్నారనే పుకార్లు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే కోచ్ రవిశాస్త్రి,కొహ్లీ మధ్య కూడా చానాళ్ళుగా సైలెంట్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో అనిల్‌ కుంబ్లేతో పడకపోవడంతో అతన్ని రవిశాస్త్రితో కలిసి సాగనంపాడు కోహ్లి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కోహ్లి, రవిశాస్త్రిలు ఒకరికి తెలియకుండా ఒకరు నిర్ణయాలు తీసుకుంటూ టీమ్ లో కన్ ఫ్యూజన్ కి కారణమవుతున్నట్లు తెలుస్తుంది.

అదే సమయంలో కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి మధ్య కూడా సఖ్యత లేదనే విషయం బయటకు వస్తోంది. గతంలో అనిల్‌ కుంబ్లేతో పడకపోవడంతో అతన్ని సాగనంపడానికి కోహ్లి ప్రధాన కారణమయ్యాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కోహ్లి, రవిశాస్త్రిలు ఒకరికి తెలియకుండా ఒకరు నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. వరల్డ్‌కప్‌కు అంబటి రాయుడును కాదని విజయ్‌ శంకర్‌ ఎంపిక చేయడమే దానికి ఉదాహరణగా చెబుతున్నారు. కోహ్లికి బోర్డు పాలకుల కమిటీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ అండదండలు ఉండడంతో అతడి నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేక పోతున్నారట..!

ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లుగా కొనసాగుతున్న కేఎల్‌ రాహుల్‌, చహల్‌ విషయాల్లో కోహ్లి జోక్యం శృతి మించిందని ప్రచారం. వీరిద్దరూ పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నప్పటికీ కోహ్లి అండదండలతోనే నెట్టకొస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో అంబటి రాయుడు విషయంలో కూడా వరల్డ్‌కప్‌కు ముందు పెద్ద చర్చే నడిచినట్లు తెలుస్తోంది. అతన్ని పేరుకు మాత్రమే స్టాండ్‌ బైగా ఎంపిక చేసినప్పటికీ జట్టులోకి రానివ్వకూడదని టీమిండియా మేనేజ్‌మెంట్‌ బలంగా కోరుకుందట. దాంతోనే అంబటిని అసలు పట్టించుకుపోవడానికి కారణంగా తెలుస్తోంది. నాలుగురోజులైన జీర్ణించుకోలేని టీమిండియా ఫ్యాన్స్ కి ఈ గ్రూప్ పాలిటిక్స్ మరింత చిరాకు తెప్పిస్తున్నాయి.