Home News Politics

ఆ అధికారి సీఎం మాటను లెక్క చేయలేదా…?

SHARE

ఏపిలో కన్ఫర్డ్ ఐఎఎస్ ల విషయంలో ప్రభుత్వ పెద్దల మాట నెగ్గలేదా? …. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా తను అనుకున్న వారికి ఐఏఎస్ గా ప్రమోషన్ ఇప్పించలేక పోయారా? .. ప్రభుత్వ రికమండేషన్‌తో పనిలేకుండా నాన్ రెవెన్యూ లిస్ట్ లో మాట నెగ్గించుకున్న ఆ రిటైర్డ్ అదికారి ఎవరు? .. దానికి సంబంధించి ప్రభుత్వంలో జరుగుతున్న ఆసక్తికర చర్చేంటి…

రాష్ట్రంలో గ్రూప్ 1 అధికారిగా పనిచేస్తూ… కనీసం 4 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి ఐఎఎస్ లుగా ప్రమోట్ చెస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి పాదనలతో లిస్ట్ లు కేంద్రం లోని డిఓపిటి శాఖకు వెళతాయి … ఆయా అధికారుల పనితీరు, అనుభవం, ట్రాక్ రికార్డ్ అధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ జాబితాలను కేంద్రానికి పంపుతుంది… డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ శాఖ దీనిపై ఇంటర్వ్యూలు చేసి గ్రూప్ 1 అధికారులకు ఐఎఎస్ లుగా పదోన్నది ఇస్తుంది… కన్‌ఫర్మ్డ్‌ ఐఎఎస్ గా చెప్పే ఈ పోస్టుల కోసం చాలా డిమాండ్ ఉంటుంది… పదవీ విరమణ సమయంలో ఐఎఎస్ హోదాలో రిటైర్డ్ అవ్వాలని కోరకునే అధికారులు దీని కోసం గట్టి ప్రయత్నాలు చేస్తుంటారు .. రెవెన్యూ శాఖలో పని చేస్తున్నవారిది ఒక లిస్టు, నాన్ రెవెన్యూ విభాగం నుంచి మరో లిస్ట్ కన్‌ఫర్మ్డ్‌ ఐఎఎస్ ల కోసం వెళుతుంది… దీని కోసం అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలు ప్రయోగిస్తారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రిటైర్‌ అయిన అధికారుల స్థానాలకు సంబంధించిన ఖాళీలపై రాష్ట్రం నుంచి లిస్ట్ వెళుతుంది… ఈ సారి నాన్ రెవెన్యూ లిస్ట్ లో 12 మంది పేర్లతో రాష్ట్రం చాలా రోజుల క్రితం కేంద్రానికి జాబితా పంపింది… ఇందులో వాడ్రేపు చిన వీర భద్రుడు, అర్జున్ రావు, రాజా బాబు అనే గ్రూప్ 1 అధికారులకు కన్ఫర్డ్ ఐఎఎస్ లుగా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నుంచి దీనిపై ఉత్వర్వులు విడుదల కాలేదు… ఈ మొత్తం వ్యవహారంలో నష్ట పోయామని భావిస్తున్న ఓ అధికారి దీనిపై కోర్టుకు వెళ్లడంతో వ్యవహారం పెండింగ్ లో పడిందంటున్నారు .. మొత్తం పన్నెండు మంది పేర్లలో ప్రభుత్వంలోని ముఖ్యులుగా ఉన్న వారి దగ్గర పని చేస్తున్న నాగార్జున, పంచాయతీ రాజ్ శాఖలో చేస్తున్నడాక్టర్ సుధాకర్ లకు మాత్రం అవకాశం దక్కలేదు..


వారిద్దరి పేర్లను స్వయంగా సిఎం, లోకేష్ లిస్ట్ లో చేర్చినట్లు తెలుస్తోంది. ..సమర్థులుగా, ప్రభుత్వానికి దగ్గర ఉన్న వీరికి ఐఎఎస్ లుగా ప్రమోషన్ ఇప్పించాలని సిఎం, మంత్రి లోకేష్ తలపెట్టినా నెరవేర లేదు. ఇది ఇప్పుడు ప్రభుత్వంలో హాట్ టాపిక్ గామారింది. ఇప్పటికే సెలక్ట్ అయ్యారని భావిస్తున్న వారిలో ఒకరికి … డిల్లీలో పని అయ్యేలా చెయ్యడంలో .. ఓ మాజీ అధికారి కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. ఆయన గతంలో సీఎస్‌గా పనిచేసారంట.. రాష్ట్రం నుంచి లిస్ట్ వెళ్లినా … ఆ లిస్ట్‌లోని అధికారులు ఢిల్లీస్థాయిలో తమ ప్రయత్నాలు తాము చేస్తుంటారు … ఆ క్రమంలో తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతో ఆ మాజీ సిఎస్‌ సెలక్టెడ్‌లిస్ట్ లో తన మనిషి పేరు ఉండేలా చేసుకున్నారట…

స్వయంగా సిఎం, లోకేష్ కు చెందిన అధికారులు సెలక్ట్ కాకుండా…. ఆ మాజీ సిఎస్ చెప్పిన పేరు లిస్ట్ లో ముందుకు రావడం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చ గా మారింది. కేంద్రం నుంచి అధికారికంగా ఇప్పటి వరకు ఉత్వర్వులు రాకున్నా…. సెలక్షన్ విషయంలో ఆ రిటైర్డ్ అదికారి డిల్లీలో స్థాయిలో చక్రం తిప్పారన్న సమాచారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో హాట్‌టాపిక్‌గా మారింది… ఏదేమైనా కోర్టు వివాదం వల్ల ఇప్పటి వరుకు ఉత్తర్వులు రాలేదని….ఆ తరువాత అయినా అవే పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది… ప్రభుత్వ అధినేత చెప్పినా కాని పని…. ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓ అధికారి చెపితే జరగడం పై అధికారుల్లో ఆసక్తి కర చర్చ జరుగుతుంది.