Home Women Health

ఆరోగ్యానికి, జీర్ణశక్తికి అద్భుత ఔషధం అల్లం

SHARE


ఆరోగ్యానికి, జీర్ణశక్తికి అద్భుత ఔషధం అల్లం :షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిధ్యాలయం పరిశోధనా ఫలితాలు వెల్లడించాయి. అల్లము నుండి తీసిన రసాన్ని, అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు.ఇటువంటి ప్రక్రియ శరీరములో సహజము గా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము. ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు. గుండె సంబంధ వ్యాధులకు, మూత్రపిండాలకు అల్లం మంచి మందు. అల్లం రసం రోజూ తాగితే ఎలాంటి శారీరక రుగ్మతలు దరిచేరవు.

 

అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది.ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

నోటి దుర్వాసన పోగొట్టే శక్తి 
అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరుగదుకీల్లవాపు ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.

ఆరోగ్యానికి, జీర్ణశక్తికి అద్భుత ఔషధం అల్లం

మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం. బాలింతరాలికి శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు. పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు.ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది. రక్త శుద్దికి తోడ్పడుతుంది. రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది.అల్లం కొన్ని వారాలపాటు వాడితే. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.అల్లం వల్ల కడుపులో పూత ఏర్పడదు.

షుగర్ నియంత్రణకు అల్లం 
షుగర్ జబ్బు దీర్ఘకాల అనారోగ్యసమస్యలు తెస్తుంది. అటువంటి షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధము -అల్లము అని సిడ్నీవిశ్వవిధ్యాలయం పరిశోధనా ఫలితాలు వెళ్ళడించాయి. అల్లము నుండి తీసిన రసాన్ని, అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు.ఇటువంటి ప్రక్రియ శరీరములో సహజము గా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము. ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోధకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు.