Home News Politics

సోంత పార్టీలో నేతలకు చుక్కలు చూపిస్తున్న రెడ్డిగారు…!

SHARE

ఇప్పుడు ప్రధాన పార్టీల్లో సర్వేలే కీలకంగా మారాయి .. పార్టీ విజయావకాశాల దగ్గరనుంచి అభ్యర్ధుల ఎంపిక వరకు అన్ని పక్షాలు ప్రజాభిప్రాయ సేకరణకు దిగుతున్నాయి .. ఆ క్రమంలో పులువురు నేతల ఆశలు ఆవిరవుతున్నాయి .. టికెట్‌ కోసం ఎప్పటి నుంచో శ్రమపడుతుంటే.. సర్వేల్లో నెగిటివ్‌ వచ్చిందని పార్టీ పెద్దలు తమను పక్కన పెట్టేస్తుండటం ఆశావహులకు మింగుడుపడటం లేదు.. ఆ క్రమంలో నాలుగు సంవత్సరాల పాటు కష్టపడి గ్రౌండ్‌ వర్క్‌ చేసుకుంటే.. సర్వే టీం పుణ్యమాని పార్టి టిక్కెట్ దక్కకపోవటంతో గుంటూరు లో వైసీపీ పార్టికి చెందిన కీలక నేత చాలా గుర్రుగా ఉన్నారు .. ఆ కసితో సొంత పార్టీలోని వారికి చుక్కలు చూపిస్తున్నారంట..

లేళ్ళ అప్పిరెడ్డి … గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా. .. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు .. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ టికెట్‌పై చాలా ఆశలే పెట్టుకున్నారాయన.. అయితే వైసీపీకి ప్రధాన సలహాదారుగా ఉన్న పీకే టీం సర్వేలో ఆయనకు చుక్కెదురైందంట.. అప్పిరెడ్డికి మైనస్ మార్కులు వచ్చాయన్న నివేదికను పార్టీ పెద్దల ముందు ఉంచారట పీకే బృందసభ్యులు .. అంతే ఆయనకు టికెట్‌ ఇచ్చేది లేదని స్పషం చేసి గుంటూరు పార్లమెంటరీ పార్టి అధ్యక్షుడిగా నియమించారు …

గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే .. నగరంలోని రెండు నియోజకవర్గాలు, పత్తిపాడు, తాడికొండ, తెనాలి, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్దులను అప్పిరెడ్డి సమన్వయం చేసుకుంటూ … ఎంపీ అభ్యర్దిగా ఉన్న కిలారి రోశయ్య కు సహకరించాల్సి ఉంది .. అయితే పశ్చిమ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన … పార్టీ తీసుకున్న నిర్ణయంతో పాటు, తనకు అప్పగించిన బాధ్యతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట.. అప్పిరెడ్డి అసంతృప్తి వైసీపీ పై డైరెక్ట్‌గానే రిఫ్లెక్ట్‌ అవుతోందంట.. ఆయన పార్టీలో ఉంటూనే.. నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న నేతలకు చుక్కలు చూపిస్తున్నారంట.. ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్‌గా మాజీ ఐపీఎస్ అధికారి ఏసురత్నంకు బాధ్యతలు అప్పగించి.. అభ్యర్ధిత్వాన్ని కూడా దాదాపు ఖరారు చేశారు జగన్‌… సర్వే టీం ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఏసురత్నానికి అవకాశం దక్కింది..

అసంతృప్తితో రగిలిపోతున్న అప్పరెడ్డి ప్రస్తుతం ఏసురత్నంతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ .. తనదైన స్టైల్లో చుక్కలు చూపిస్తున్నారంట .. పార్టీలోని తన అనుచరగణం ఏసురత్నం వైపు వెళ్ళకుండా, ఆయనకు సహకరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట … ఈ వ్యవహారం ఏసురత్నం దృష్టికి వెళ్లడంతో .. ఆయన అధినేతకు ఫిర్యాదు చేయడానికి ఆధారాలు సేకరించుకునే పనిలో పడ్డారంట .. గుంటూరుతో దశాబ్దాల అనుబంధం ఉన్న అప్పిరెడ్డి తనకున్న పరిచయాలతో ఏసురత్నానికి వ్యతిరేకంగా ఓటర్లను కూడా ప్రభావితం చేసే పనిలో పడ్డారంట.. గుంటూరు లోక్‌సభ సెగ్మెంట్‌ వైసిపి అధ్యక్షుడిగా ఉంటూ.. అప్పిరెడ్డి చేస్తున్న తెరవెనుక కార్యకలాపాలు చూస్తూ … వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ మొదలైంది …

అంతే కాదు గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే ముస్తాఫా పై కూడ అప్పిరెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి .. ఎమ్యెల్యే ముస్తాఫాకు వ్యతిరేకంగా మొన్నామధ్య జరిగిన అసమ్మతివాదుల సమావేశం వెనుక అప్పిరెడ్డి హస్తం ఉందంటున్నారు … సదరు అసమ్మతి సమావేశానికి వచ్చిన వారంతా అప్పిరెడ్డి మనుషులేనని చెబుతున్నారు … గత ఎన్నికలతో ఇప్పుడు కూడా వైసిపి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావహులను పోగుచేసి అప్పరెడ్డి పార్టీలో విభేదాలకు కారణమవుతున్నారని అంటున్నారు .. అయితే ఎమ్మెల్యే ముస్తాఫా మాత్రం ఈ వ్యవహరం పై ఎక్కడా స్పందించటం లేదు.. ఆయన అనుచరులు మాత్రం ఇదంతా టిడీపీ కుట్రగా ఫోకస్‌ చేసే పనిలో పడ్డారు …

అసంతృప్తివాదుల సమావేశానికి వచ్చిన క్యాడర్ ఎవరన్నదానిపై పార్టీ పరంగా ఎంక్వైరీ మొదలుపెట్టినట్లు తెలిసింది .. ఆ సమావేశానికి హాజరైంది అప్పిరెడ్డితో పాటు మరి కొంతమంది పార్టి నేతల అనుచరులే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .. నిఘావర్గాలు కూడా ఆ విషయాన్ని ధృవీకరించినట్లు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి …. పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అప్పిరెడ్డి నడిపిస్తున్న ఈ తతంగం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి