Home News Updates

తెలంగాణలో హెల్త్ ఎనర్జెన్సీని ప్రకటించాలి- బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు

SHARE

ప్రభుత్వం చేతకాని తనంతో ఆర్టీసీ కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. డెంగీ, విష జ్వరాలను నియంత్రించటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు, డాక్టర్లు, టెక్నీషియన్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెట్టాలి.

ప్రజల ఆరోగ్యం కోసం కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రిపై ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి ..ప్రజలపై చూపించటం సరైంది కాదు.

ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. నిధులు కొరతతో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలున్నారు.