Home Entertainment Cinema

గీత గోవిందం.. ది కింగ్ ఆఫ్ నైజాం..!

SHARE

గీత‌గోవిందం మ‌రో రికార్డ్ ను అధిగమించింది. ఇప్పటికే చాలా సినిమాల‌ను అలా ప‌క్కకు నెట్టేసిన ఈ చిత్రం ఇప్పుడు ఫిదాను కూడా దాటేసింది. ఈ చిత్రం తెలంగాణ‌లో 18.10 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అప్పట్లో భారీ సినిమాల‌కు సైతం కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది. ఇప్పటికీ నైజాం టాప్ 10 సినిమాల లిస్ట్ లో ఫిదా ఉంటుంది. ఈ చిత్ర వ‌రల్డ్ వైడ్ బిజినెస్ 18 కోట్లు అయితే.. నైజాంలోనే అంత తీసుకొచ్చింది ఫిదా. సాయిప‌ల్లవి ఇమేజ్ కు తోడు వ‌రుణ్ తేజ్ ఇమేజ్.. శేఖ‌ర్ క‌మ్ముల మ్యాజిక్ అన్నీ క‌లిసి ఫిదాను బ్లాక్ బ‌స్టర్ చేస్తే… ఇప్పుడు గీత‌గోవిందం కూడా అంతేస్థాయిలో మైండ్ బ్లాక్ చేస్తోంది. విజ‌య్ దేవ‌రకొండ ఇమేజ్ తో రికార్డులు అలా పెకలించుకుపోతున్నాయి.

ఇప్పటికే 19 రోజుల్లో ఈ చిత్రం నైజాంల్ 17.90 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇంక ఒక రోజులో ఆ మిగిలిన మొత్తం కూడా క్రాస్ చేయడం ఖాయం. ఇప్పుడు నైజాంలో గీత‌గోవిందం నెక్ట్స్ టార్గెట్ 20 కోట్లు. ఇది కానీ చేరుకుందంటే విజ‌య్ స్థాయి సూప‌ర్ స్టార్ అన్నమాట‌. ఎందుకంటే నైజాంలో 20 కోట్ల మార్క్ అంటే చిన్న విష‌యం కాదు.. కానీ ఇప్పుడు విజ‌య్ కు మాత్రం ఇది చిన్న విష‌య‌మే అనిపిస్తుంది. ఇప్పటికే 19 రోజుల్లో 61 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికీ వ‌సూళ్లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి అంత‌గా క‌నెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. క‌చ్చితంగా ఫుల్ ర‌న్ లో ఈ చిత్రం 65 కోట్లకు పైగా షేర్ వ‌సూలు చేయ‌డం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.