Home Entertainment Cinema

షారుఖ్‌ భార్య పోస్ట్ చేసిన ఫోటో చూసి నెటిజన్స్‌ షాక్…!

SHARE

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే షారుఖ్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆవిడ తరచు ఇంటీరియర్‌ డిజైన్‌కు సంబంధించిన విషయాలు తన వాల్ పై పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె తన ఇంట్లో ఉన్న ఓ పెయింటింగ్‌ ని పోస్ట్ చేసి ఇంటీరియర్‌ డిజైన్‌ అందంను ఈ ఫోటో మరింతగా పెంచేసింది అంటూ పోస్ట్‌ చేసింది. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఆమె పోస్ట్‌ చేసిన పెయింటింగ్‌ లో ముగ్గురు పూర్తి న్యూడ్‌గా ఉన్నారు. దాంతో పాటు ఒక మహిళను ఇద్దరు మగాళ్లు అసహ్యంగా రేప్‌ చేస్తున్నట్లుగా ఉంది.

ఇక అంతే ఆ ఫోటో షేర్ తో నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు గౌరీఖాన్. అలాంటి ఫొటోలను ఇంట్లో ఎలా పెట్టుకుంటారు అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైరయ్యారు గౌరీఖాన్ పై…ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వారి ముందు ఇలాంటి ఫొటోలు ఎలా మీరు ఉంచుతారు, దీని ద్వారా మీరి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రశ్నలవర్షం కురిపించారు.

మీరు ఒక గొప్ప నటుడి భార్య అనే విషయాన్ని గుర్తించుకుని ఏ పని అయినా చేయాలి. మీరు షారుఖ్‌ పరువు పోయేలా ప్రవర్తిస్తున్నారు. మీరు చేస్తున్న పనుల వల్ల మీ కుటుంబం పరువు పోతుందంటూ మరి కొందరు ఆరోపణలు చేశారు. అయితే గౌరీ ఖాన్‌ మాత్రం తన ఫొటోను సమర్ధించుకుంటుంది.