Home News Stories

ఇది వరంగల్ ఘనపూర్ రాజకీయం…

SHARE

రాజకీయంగా ఒకరంటే ఒకరికి అస్సలు పడదు..ఆ ఇద్దరు ఉప్పునిప్పులా మెసులుతారు.. ఒకరు తన రాజకీయ మనుగడ కోసం పాకులాడుతుంటే.. మరొకరు తన కుమార్తె పొలిటికల్‌ ఫ్యూచర్‌ కోసం పావులు కదుపుతున్నారు .. ఇదీ ప్రస్తుతం స్టేషన్‌ఘనపూర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్టర్నల్‌ పాలిటిక్స్.

అక్కడ సిట్టింగ్‌ అయిన రాజయ్యకు కేసిఆర్ మళ్లీ టికెట్ ఇవ్వడంతో .. అదే సెగ్మెంట్‌కు చెందిన కడియం శ్రీహరి తన వ్యూహాల్లో తాను ఉన్నారు… అలాంటి టైంలో ఎవరూ ఊహించని విధంగా కడియం శ్రీహరి దగ్గరికి రాజయ్య స్వయంగా వచ్చి ఆశీర్వదించమని అడగడం ప్రాధాన్యత సంతరించుకుంది … దానిపై కడియం ఎలా స్పందించారు?.. అసలు ఆయన మనస్సులో ఏముంది?

ఒకరు ప్రస్తుత ఆపద్ధర్మ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి…. మరొకరు మాజీ డిప్యూటీ సిఎం తాటికొండ రాజయ్య…. ఇద్దరిదీ ఒకే నియోజకవర్గం వరంగల్‌ జిల్లా స్టేషన్ ఘనపూర్… నియోజకవర్గంలో పైచేయి కోసం ఇద్దరి మధ్య ముందు నుంచి తీవ్ర పోటీ ఉంది.. ఇద్దరూ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా ఆ గ్యాప్‌ అలాగే కొనసాగుతోంది.. అలాంటి పరిస్థితుల్లో తన కేబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను భర్తరఫ్ చేసి ఆ స్థానంలో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేశారు టీఆర్‌ఎస్‌ అధినేత…

వరంగల్‌ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరితో రాజీనామా చేయించి .. శాసనమండలి సభ్యత్వం ఇచ్చి తన కేబినెట్లోకి తీసుకున్నారు… దాంతో సహజంగానే కడియం, రాజయ్యల మధ్య గ్యాప్‌ మరింత పెరిగినట్లైంది.. ఆ క్రమంలో తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా తీసుకురావాలని భావించారు కడియం .. ఈ సారి స్టేషన్ ఘనపూర్ నుంచి ఆమెను పోటీలో దించాలన్న ఉద్దేశంతో టికెట్ కోసం ప్రయత్నం చేశారు… అయితే సిట్టింగ్‌లకే సీట్లన్న కేసిఆర్ … టికెట్‌ రాజయ్యకే కట్టబెట్టారు..

నియోజకవర్గంలో కడియం శ్రీహరి, రాజయ్యల వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది … వారు ఒకే పార్టీలో ఉన్నా ఎప్పుడూ కలివిడిగా వ్యవహరించిన దాఖలాలు కనిపించవు.. వారు కలుసుకుని మాట్లాడుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు కలుస్తారని ఊహించలేదు… అలాంటిది మినిస్టర్‌ క్వార్టర్స్‌కి తన అనుచరవర్గంతో సహా వచ్చిన రాజయ్య స్వయంగా కడియంను కలిసి తనను ఆశీర్వదించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది … ఓ మహిళతో రాజయ్య అసభ్యంగా మాట్లాడినట్లు చెప్తున్న ఆడియో టేపులు ..చక్కర్లు కొడుతున్న సమయంలో రాజయ్య కడియంను కలవడం మరింత ఆసక్తి రేపింది.. దాదాపు అరగంటపాటు రాజయ్య టీంతో కడియం భేటీ అయ్యారు.

ఆ భేటీలో గత నాలుగున్నరేళ్లలో జరిగిన పరిణామాలను రాజయ్యకు వివరించారంట కడియం శ్రీహరి… తన అనుచరులను ఇబ్బందులపాలు చేశారని, కుమార్తెను రాజకీయంగా అవమానాల పాలు చేసారని .. అవన్నీ ఎలా మర్చిపోతామని కుంటబద్దలు కొట్టినట్లు చెప్పారంట.. . తాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ వచ్చి ప్రచారం చేయలేనని తేల్చి చెప్పేశారంట..

రాజకీయంగా రాజయ్య ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో … ఆ పరిణామాలు ఎటు దారితీసే అవకాశం ఉందో ..ఆయన అనుచరుల ముందే మొహమాటం లేకుండా వివరించారంట … ప్రస్తుతం డిప్యూటీ సిఎం హోదాలో కడియం ఉన్నారు… ఎక్కడా పోటీ చేయడం లేదు కాబట్టి జిల్లాలో ప్రచార బాధ్యతల్ని కడియంకు అప్పగించే అవకాశాలున్నాయి… ఇటు చూస్తే కడియం తన సొంత నియోజకవర్గమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రచారం చేసేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు.. మరి అధిష్టానం కడియంకు ఏం చెప్తుంది ? దానికి కడియం ఏం చేస్తారన్నది ఇప్పుడు సస్పెన్ష్ గా ఉంది.