Home Entertainment Cinema

ఈ ఏడుపుని అలా వాడుకున్నారన్నమాట!!

SHARE

వరుస సక్సెస్ ఫుల్ మూవీలతో బాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డాషింగ్ యంగ్ హీరో వరుణ్ ధవన్ ఇప్పుడు డిఫరెంట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. వరుణ్, అనుష్క శర్మ లీడ్ రోల్స్ లో శరత్ కటారియా తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా సుయి ధాగా మేడిన్ ఇండియా. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రం టీజర్ అందర్నీ ఆకర్షించింది.

మహాత్మాగాంధీ మేడిన్ ఇండియా కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ఒక టైలర్ పాత్రలో కనిపిస్తుండగా అనుష్క శర్మ మమత  అనే డీ గ్లామర్ రోల్ లో కనిపించబోతోంది.  నిరుద్యోగులుగా ఉన్న ఇద్దరు స్వయం ఉపాధితో ఎదిగిన సక్సెస్ స్టోరీయే ఈ మూవీ టీజర్ రిలీజ్ తర్వాత అనుష్క క్యారెక్టర్ నేమ్ సెన్సేషన్ గా మారిపోయింది. అనుష్క ఏడుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి.