Home Women Beauty

నీరు తాగండి బరువు తగ్గండి? వెయిట్ లాస్ టిప్స్!

SHARE

How to lose weight with drinking water. The advantages of consuming water. Here we explained the water therophy and weight loss tips:

బరువు తగ్గడం ఇప్పుడు అందరి అవసరం. కొంత మంది అందం కోసం ఆరాట పడితే, మరికొంత మంది ఆరోగ్యం గా ఉండేందుకు బరువు తగ్గాలను కుంటారు. ఆర్తి అగర్వాల్ ఘటన తర్వాత లైపో వంటి చికిత్సా పద్దతులంటే జనం భయపడుతున్నారు. లైపో రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడితే, సహజ సిద్దంగా బరుగు ఎలా తగ్గాలి అనే విషయం ఇక్కడ చూద్దాం.

నీరు తాగండి బరువు తగ్గండి? వెయిట్ లాస్ టిప్స్!

నీరు అవసరం ఎంత?
మనిషికి నీరు ప్రాణాధారం. శరీరం లో జరిగే మెటాబయాలిజానికి నేరే ముఖ్యం. నీటి వల్ల జరిగే కెమికల్ రియాక్షన్స్ తో రక్త కణాలు ఆరోగ్యం గా ఉంటాయి. శరీరం లోని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే ఇది ముఖ్యం. బరువు తగ్గడానికి నీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.

బరువు తగ్గడానికి నీటిని వివిధ రకాలు గా వినియోగిస్తారు. ఇక్కడ మీకు మేం సహజ మయిన నియమాన్ని చెబుతున్నాం. ఇది ఎవరికీ ఇబ్బంది లేనిది.

75 క్యాలరీలు X 365 రోజులు అంటే సుమారు 27,375 క్యాలరీలు ఏడాదిలో పొదుపు చేయోచ్చు. దీని ప్రకారం ఏడాదిలో 4 కేజీలు బరువు సహజ సిద్దంగా తగ్గవచ్చు

ఓ సర్వే ప్రకారం ప్రతీ ఆకలి… ఆకలి కాదని.. పలు సందర్భాల్లో అది దాహం అని తేలింది. అందువల్ల మీకు వేసేది ఆకలో , దాహమో తెలుసుకోండి.

మరో ముఖ్యమయిన టిప్: భోజనం చేసే ముందు కడుపు నిండా నీటిని సేవించండి. ఇది కేవలం బరువు తగ్గాలనుకునే వారు మాత్రమే. ఇలా చేయడం వల్ల భోజనాన్ని అతిగా తీసుకోకుండా జాగ్రత్త పడొచ్చు.
ప్రతీ రోజు ఇలా చేయడం వల్ల సుమారు 75 క్యాలరీలు పెరగకుండా పొదుపు చేయవచ్చు. ఈ చర్య సహజ సిద్దంగా జరగడం వల్ల సయిడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు.

75 క్యాలరీలు అంటే ఇది ఎక్కువగా అనిపించక పోవచ్చు. కానీ, 75 X 365 రోజులు అంటే సుమారు 27,375 క్యాలరీలు ఏడాదిలో పొదుపు చేయోచ్చు. దీని ప్రకారం ఏడాదిలో 4 కేజీలు బరువు సహజ సిద్దంగా తగ్గవచ్చు.

మరో పొస్ట్ లో బరువు తగ్గే మరో చిట్కా చూద్దాం.