Home Entertainment Cinema

ఆ స్టార్ డైరక్టర్ సీన్ చూసి జాలిపడుతున్న ఇండస్ట్రీ…!

SHARE

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇది మన తెలుగు సినీ ఇండస్ట్రీకి ఖచ్చితంగా సూట్ అయ్యే వ్యాఖ్య. ఒక్కసారి సినిమా హిట్ అయితే ఆ స్టార్ డమ్ ఏ వేరు. కోట్లకు కోట్లు కాళ్ళ దగ్గర వాలతాయి.డిమాండ్ ఎక్కువ ఉంటే రెమ్యూనరేషన్ అలాగే ఉంటుంది మరి. కాని ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం ఈ లోపు ఎక్కడో తన్నేసి బొక్క బోర్లా పడతారు ఇప్పుడిదంతా ఎందుకంటారా ఇలాంటి ఇన్సిడెంట్ ఏ ఇప్పుడు టలివుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

స్టార్ హీరోల విషయం ఎలా ఉన్నా డైరెక్టర్ల విషయంలో మాత్రం ఇదే సూత్రం వర్తిస్తుంది. గతంలో స్టార్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో టాప్ రేంజ్ ను ఎంజాయ్ చేసిన ఒక దర్శకుడి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉందట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఒకప్పటి స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల మైత్రీ మువీస్ లెటేస్ట్ మువీ ‘అమర్-అక్భర్-ఆంటోని కోసం నెలవారీ జీతంతో పని చేశాడట. ఒక సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుండి రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు నెల జీతానికి పనిచేయాల్సి వచ్చిందట.


హ్యాట్రిక్ డిజాస్టర్లతో అయన మార్కెట్ బాగా దెబ్బతినడంతో తాజా చిత్రానికి నిర్మాతలు ఆయనకు రూ. 4.5 లక్షల నెల జీతాన్ని ఇచ్చారని సినీ వర్గాలలో గాసిప్పులు వినిపిస్తున్నాయి. సినిమా హిట్ అయితే మాత్రం ప్రాఫిట్స్ లో లాభాలు ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారట ఈ డైరక్టర్ . కానీ సీనిమా డిజాస్టర్ టాక్ తో వైట్ల ఆశలు ఆవిరయ్యాయి. సినిమాకు నిర్మాతలు 23 కోట్ల బడ్జెట్ ఇస్తే.. వైట్ల మాత్రం రూ. 21 కోట్లలోనే సినిమాను కంప్లీట్ చేసి పెట్టాడట. కాని ఫలితం మరోలా ఉండటంతో ప్రస్థుతం ఆయనకు మరో సినిమా ఆఫర్ దొరకడం అసాధ్యమేనని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.