Home Entertainment Cinema

వీరి వెడ్డింగ్ చాల కాస్ట్ గురూ…!

SHARE

బాలీవుడ్ ప్రేమ జంట దీపిక ప‌దుకొనే, ర‌ణ‌వీర్ సింగ్ పెళ్లి హంగామా మొదలైంది. గత కొన్నేళ్లుగా లవ్ అండ్ డేటింగ్‌లో ఉన్న దీపిక, రణవీర్ సింగ్‌లు పెళ్లి బంధంతో ఒకటికానున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో మరికొన్ని గంటల్లో వీరి వివాహం జరగబోతుంది. లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియానెల్లా వీరి వివాహానికి వేదిక కానుంది. వీరి వివాహం రెండు రోజుల పాటు దక్షణ భారతీయ, సింధీ సాంప్రదాయాల్లో జరగనుంది.

గత కొన్నేళ్లుగా లవ్ అండ్ డేటింగ్‌లో ఉన్న దీపిక, రణవీర్ సింగ్‌లు పెళ్లి బంధంతో ఒకటికానున్నారు. ఇటలీలోని లేక్ కోమోలో మరికొన్ని గంటల్లో వీరి వివాహం జరగబోతుంది. ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కళ్లు చెదిరే ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత ఖరీదైన విల్లా డెల్‌ బాల్బినెల్లా సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివాహ అతిథుల కోసం లేక్ కోమో తూర్పు ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్టును బుక్ చేశారు.

వారం రోజుల పాటు దీపిక, రణవీర్ ఫ్యామిలీ సభ్యులు ఇక్కడే స్టే చేయనున్నారు. ఇందులో మొత్తం 75 గదులకు గానూ రూ. 1.73 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో రూముకి రోజుకి రూ. 35 వేలు చెల్లిస్తున్నారు. ఇందులోనే బార్లు, రెస్టారెంట్టు, ఇండోర్ స్మిమ్మింగ్ ఫూల్ తదితర అధునాతన సదుపాయాలు ఈ రిసార్టులో ఉన్నాయి. ఇక స్విజర్లాండ్ నుండి చెఫ్‌లను, ఫ్లోరెన్స్ నుండి ఫ్లవర్ డెకరేషన్ నిపుణుల్ని రప్పించారు.


ఇక సినిమాల్లో హీరోహీరోయిన్లు ఎంట్రీలాగే పెళ్లిలో రణవీర్, దీపికాల ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారట. నీళ్లపై ల్యాండ్ అయ్యే మినీ ప్లేన్‌లో వివాహ వేదిక వద్దకు రాబోతోందట వీర్‌దీప్ జంట. ఇక అతిథులు కూడా లగ్జరీ బోటులో నీటి మార్గం ద్వారా వివాహ వేదిక వద్దకు చేరుకోనున్నారట. ఈ ఖరీదైన పెళ్లిలో ఇంకెన్ని ఆర్భాటాలు ఉన్నాయో చూడాలి.