Home News

పాత,కొత్తల కలబోత కాగలదా మున్సిపల్ విజేత…!

SHARE

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి చేరిన నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ నేతల మధ్య సఖ్యత కుదురుతోందా? కొత్త -పాత అన్న చర్చ జరుగుతుందా ? టిఆర్ఎస్ లో అందరూ కలిసి పనిచేయాలేకపోతున్నారా ? నేతలు కలిసి పనిచేయకపోతే పార్టీ పై ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది?.. పార్టీ మారి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్‌ పరిస్థితిపై వినిపిస్తున్న టాక్‌ ఏంటి? పాత,కొత్తల కలబోతతో మున్సిపల్‌ ఎన్నికల్లో విజేతగా నిలుస్తుందా…?

ముందస్తు ఎన్నికల వెళ్లి …తిరిగి అధికారంలోకి వచ్చింది టిఆర్ఎస్… 88 ఎమ్మెల్యేలు గెలిస్తే … ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు .. ఆ తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు … అప్పటి నుంచి ఆయా నియెజకవర్గాల్ల్లో కొత్త, పాత నాయకుల మధ్య సమన్వయం కోసం పార్టీ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి … ఆ క్రమంలో గత నెల 27 నుంచి టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది … సభ్యత్వ నమోదు భాద్యతలను ఎమ్మెల్యేలకు …వారు లేని చోట ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించింది టిఆర్ఎస్ .

సభ్యత్వ నమోదు ప్రారంభంలోనే పాత,కొత్త నేతల ఆదిపత్యపోరు మొదలైంది. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీని వీడారు… సభ్యత్వ నమోదులో తమకు ప్రాధన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రామగుండం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా కోరుకుంటి చందర్ పోటీ చేసి సోమారపుపై గెలిచి … ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు … అప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య గ్యాప్ వచ్చి…. సోమారపు సత్యనారాయణ రాజీనామాకు దారి తీసింది … ఆయన బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిన నియెజకవర్గాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటున్నాయి… కొల్లపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నారు … మరోవైపు పార్టీలో చేరిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగిస్తున్నారు … ఒకే నియెజకవర్గంలో ఇద్దరు టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంను చేపట్టడంతో పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి…

ఎమ్మెల్యేలకు సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించడంతో …. పోటి చేసి ఓడిన నేతల్లో కొందరు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది … ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లో పరిణామాలను అధికార టిఆర్ఎస్ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది … కొత్త పాత నేతల మధ్య సమన్వయానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించింది …

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో హోరా హోరీగా పోరాడి … ఇప్పుడు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి రావడం సదరు నేతలకు మింగుడుపడుతున్నట్లు కనిపించడం లేదు … రెండు, మూడు నియెజకవర్గాల్లో కలిసి పని చేస్తున్నట్లు బయటకు కనిపిస్తున్నా… వారి మధ్యి నిజంగా అంత సమన్వయం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది … ఆయ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే .. మున్సిపల్‌ ఎన్నికల్లో కష్టమవుతోందని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి..