Home News

ఆ ఫైల్ ని సీఎం కేసీఆర్ విసిరి కొట్టారా…?

SHARE

దొడ్డి దారి టీచర్ల బదిలీలపై సీఎం సీరియస్ అయ్యారా?… తన దగ్గరికి వచ్చిన ఫైల్ ని కోపం తో పక్కకు పెట్టేశారా?… తీసుకెళ్లిన అధికారులపై మండిపడ్డారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.. టీచర్స్‌ ట్రాన్స్‌ఫర్స్‌ ఎపిసోడ్‌కి సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలపై సెక్రటేరియట్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు …

తెలంగాణ ప్రభుత్వం రీసెంటుగా కొందరు టీచర్లను బదిలీ చేసింది … ఓ 15 మంది ఉపాధ్యాయులు పైరవీలు చేసుకొని తాము కోరుకున్న ప్లేస్ కి బదిలీ చేసుకున్నారు… ఈ బదిలీల వెనుక బలమైన శక్తులు పని చేసాయంట … ఈ బదిలీల ఫైల్‌పై సీఎం సంతకం చేసేయడంతో లొల్లి లేకుండా పోయింది …

ఆ విషయం తెలిసి మరి కొందరు కూడా బదిలీల చేయాలని పైరవీలు మొదలు పెట్టారంట … తమకు తెలిసిన వారితో, బంధువులతో ప్రయత్నాలు చేసుకున్నారంట … ఆ పైరవీలు వర్కౌట్‌ అయి సంబంధిత అధికారులు దాదాపు 40 మంది బదిలీలకు సంబంధించిన ఫైల్ సీఎం ముందు పెట్టారంట … ఆ ఫైల్ ని చూసి సీఎం అగ్గి మీద గుగ్గిలం అయ్యారట… ఫైల్ తీసి పక్కకి విసిరేసారట… ఏందీ లొల్లి అని ఫైర్‌ అయ్యారట … మొన్నటి బదిలీ లే రచ్చ రచ్చ అయ్యాయి అని సీరియస్ అయ్యారట…. అసలు మొన్న చేసిన బదిలీలనే క్యాన్సిల్ చేయాలని ఆర్డర్‌ వేసారంట …

టీచర్ల బదిలీ అంశం రచ్చ రచ్చ కావడం, మీడియాలో రక రకాల కథనాలు రావడంతో సీఎం కి కోపం వచ్చిందంటున్నారు … ఈ అంశం పై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన లు చేసి … అక్రమ బదిలీలను నిలిపివేయాలని డిమాండ్ చేశాయి … ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాయి … రీసెంట్ గా విద్యా శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా కామెంట్ చేశారు… ఇవన్ని కూడా సీఎం ఆగ్రహానికి కారణం అయ్యాయని తెలుస్తోంది..

మొత్తమ్మీద తమకు కూడా బదిలీ అవుతుందని ఆశ పడ్డ వారి ఆశలు ఆడియాసలు అయ్యాయి.. ఏదో పైరవీలు చేసుకుని, పెద్దల లాబీయింగ్‌లతో చేతిచమురు కూడా వదుల్చుకున్న ఆ టీచర్లు తాజా పరిణామాలు మింగుడు పడక లబోదిబోమంటున్నారిప్పుడు.