Home News

సీఎం అందుకే సచివాలయానికి రావట్లేదా…!

SHARE

ఇటివల ప్రతిరోజు సీఎం సచివాలయానికి వస్తున్నారు సమీక్షల్లో పాల్గొంటారని సీఎంఓ నుంచి  సమాచారం వస్తుంది… తీరా సమయానికి సమీక్షలన్నీ సీఎం క్యాంపు కార్యాలయం తాడేపల్లికి మారుతున్నాయి. అన్ని సమీక్షలను సీఎం ఇక్కడే ముగించేస్తున్నారు. దీంతో జగన్ సచివాలయానికి ఎందుకు రావడంలేదనే చర్చ ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల్లో జోరుగా నడుస్తుంది. అసలు సీఎం జగన్ సచివాలయానికి డుమ్మా కొట్టడానికి కారణం ఏంటీ..?

రాష్ట్ర పరిపాలన కేంద్రమైన ఏపీ సచివాలయంలో ఏం జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని అమరావతిలోని వెలగపూడిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం సచివాలయాన్ని ఆరు బ్లాకుల్లో నిర్మించింది. ఆరవ బ్లాకులో అసెంబ్లీని, శాసనమండలిని నిర్మించారు. ఐదవ బ్లాకులో వివిధ శాఖల ఉద్యోగులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని తొలి అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎం పేషీ, చీఫ్ సెక్రటరీ కార్యాలయం, క్యాబినెట్ సమావేశ మందిరాలున్నాయి.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన జిల్లాల పర్యటనలు, పార్టీ సమావేశాలు లేని సమయంలో సచివాలయానికి ఉదయం వచ్చి, సాయంత్రం వరకు ఉండేవారు. ఇక ప్రభుత్వం మారి జగన్మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక సచివాలయంలోని తన ఛాంబర్‌లోకి అట్టహాసంగా ప్రవేశించారు. ఆ తర్వాత క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. ఆ తర్వాత మాత్రం సచివాలయం వైపు సీఎం కన్నెత్తి చూడట్లేదు…