Home News Politics

వైసీపీలో ఆమంచి ఎంట్రీ రేపేనా…!

SHARE

ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సొంత జిల్లా కడపలో బాబుకు షాక్ ఇచ్చిన వైసీపీ అధినేత ఈసారి ప్రకాశం జిల్లా నుంచి మరో పంచ్ ఇవ్వనున్నారు. ప్రకాశం రాజకీయల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచే చీరాల ఎమ్మెల్యే రేపు వైసీపీలో చేరబోతున్నరన్న టాక్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది….

కడప జిల్లాలో టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మొన్న టీడీపీకి గట్టి షాకిస్తూ వైసీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఆయన సొంత జిల్లాలోనే దెబ్బ కొట్టేద్దామని భావిస్తూ వచ్చిన టీడీపీకి ఈ పరిణామం పెద్ద షాక్ ఇవ్వగా అదే తరహాలో ఇప్పుడు ప్రకాశం జిల్లాలోనూ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఆమంచి ఆ తర్వాత పరిణామాల్లో టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు. సీఎం సొంతగా కలుగజేసుకుని ఆనాడు ఆమంచిని సైకిలెక్కించారు.

ప్రజల్లో మంచి పలుకుబడి కలిగిన ఆమంచికి నియోజకవర్గం పై మంచి పట్టుందనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ఏ పార్టీ తరఫున అయినా గెలిచే ఛాన్సే అధికం. ఈ క్రమంలో టీడీపీ పట్ల ఆమంచిలో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన వైసీపీ రంగంలోకి దిగి సక్సెస్ అయినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చాలా పకడ్బందీగా – చాలా ప్లాన్డ్ గా ముగించడంలో వైసీపీ కీ లీడర్ ఎంపీ విజయసాయిరెడ్డి చక్కబెట్టినట్లు తెలుస్తుంది.చీరాల టీడీపీలో గ్రూపు తగదాల పట్ల కూడ ఆమంచి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.

వైసీపీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రేపు సాయంత్రంలోగా ఆమంచి జగన్ తో భేటీ అవుతారని తెలుస్తుంది. 6 నుంచి జగన్ చిత్తూరు,కడఫలో పర్యటించాల్సి ఉన్నందున రేపు సాయంత్రమే ఆమంచికి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.. గత కొన్ని నెలలుగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు ఆమంచి…గతంలోనే పార్టీ మారతారన్న ప్రచారం జరిగిన అప్పుడు అది మాటలకే పరిమితమైంది.

ఆమంచి వ్యవహారం తెలుసుకున్న టీడీపీ కోర్ టీం ఇప్పటికే రంగంలోకి దిగినా అప్పటికే ఆమంచి పార్టీ మారే విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అటు చంద్రబాబు బుజ్జగింపులు ఇటు సాయిరెడ్డి మంత్రాంగంతో ఫైనల్ గా వైసీపీ వైపే మొగ్గిన ఆమంచి టీడీపీకి ఝలక్కిచ్చేందుకే నిర్ణయం తీసుకున్నారట.