Home Entertainment Cinema

బిగ్ బాస్ హోస్ట్ పై చిన్మయి మాటల మంటలు…!

SHARE

బిగ్ బాస్ అంటేనే కేరాఫ్ కాంట్రావర్సిగా మారింది. అది తెలుగు అయినా తమిళ్ అయినా ఎక్కడైనా వివాదస్పదం అవ్వాల్సిందే. ఇప్పుడు తమిళ బిగ్ బాస్ లో హోస్ట్ కమల్ హాసన్- కంటెస్టెంట్ శరవణన్ మధ్య సాగిన సంభాషణ ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ‘నేను అమ్మాయిల్ని ముట్టుకోవచ్చన్న కారణంతోనే కాలేజీకి బస్సుల్లో వెళ్లేవాడిని’ అన్న శరవణన్ వ్యాఖ్యల పై సింగర్ చిన్మయి శ్రీపాద ఓ రేంజ్ లో ఫైరయ్యారు.

చిన్మయి ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘అమ్మాయిల్ని ముట్టుకోవచ్చనే బస్సుల్లో ప్రయాణించేవాడినంటూ ఓ వ్యక్తి గర్వంగా చెప్పుకొంటున్న వీడియోను ఓ తమిళ ఛానల్‌ ప్రసారం చేసింది. పైగా అతని వ్యాఖ్యల పట్ల చప్పట్లు కొడుతూ నవ్వుకుంటున్న వారికి ఇది జోక్‌గా అనిపిస్తోందా?’ అని ట్వీట్‌లో పేర్కొంది. అతని వ్యాఖ్యల పట్ల చప్పట్లు కొడుతూ నవ్వుకుంటున్న వారికి ఇది జోక్‌గా అనిపిస్తోందా?’ అని ట్విట్టర్ లో ఫైరయింది. చిన్మయి ట్విట్ పై ఒకొక్కరు ఒక్కోలా స్పందించారు.

ఒక యువతి మాత్రం చిన్మయికి మద్దతు తెలుపుతూ బస్సులో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను ఓ లేఖలో రాశారు. ఆ లేఖలో.. ‘శరవణన్‌లాంటి వారికి బుద్ధిచెప్పినందుకు ధన్యవాదాలు చిన్మయి. అమ్మాయిల్ని ముట్టుకోవడానికే బస్సులు ఎక్కడమనేది ఇలాంటివారికి జోక్‌గా ఎలా అనిపిస్తోందో నాకు అర్థంకావడంలేదు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్‌కు బస్సులో వెళుతుంటే ఓ వృద్ధుడు ఎక్కడపడితే అక్కడ చేతులేశాడు. అలా ఎందుకు చేశాడో అర్థంకాలేదు. దాంతో అక్కడే ఉన్న ఓ అన్నకు చెప్పాను. అతను సాయం చేయకపోగా నన్ను తన వద్దకు లాక్కుని మరింత వికృతంగా ప్రవర్తించాడు’ అంది.

నా లాంటి వారి బాధని అర్ధం చేసుకుని స్పందించినందుకు లవ్యూ చిన్మయి అక్కా’ అని పేర్కొంది. ఈ లేఖను చిన్మయి ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. తన వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించినవారికి ధీటుగా సమాధానం ఇచ్చింది. ‘నాపై కామెంట్లు చేస్తున్నవారు ఓసారి ఈ లేఖను చదవండి’ అన్నారు.

దానికి ప్రతిగా స్పందించిన నటుడు శరవణన్.. అవును అలాంటి కొంటె పనులు నేను కూడా చేశాను. కాలేజ్ కి వెళ్లేప్పుడు బస్సుల్లో గర్ల్స్ ని టచ్ చేసి ఆనందించేవాడిని. అయితే ఇప్పుడు అలా లేను. మారిపోయాను! అంటూ తన వ్యాఖ్యలను కవర్ చేసుకున్నాడు. దీని పై కామెడీగా స్పందించిన కమల్ పై చిన్మయి విరుచుకుపడ్డారు. అతడికి చీవాట్లు పెట్టాల్సింది పోయి.. గొప్ప పని చేశావ్!! అంటూ పొగిడేశారు కమల్ అని విమర్శించింది.

మొత్తానికి బిగ్ బాస్ ఎక్కడైనా వివాదాలకు కేరాఫ్ గానే నిలుస్తుంది. ఇక తమిళ బిగ్ బాస్ లో ఇది కొంచెం ఎక్కువే…