Home Women Recipes

చికెన్ చట్ పట్

చికెన్ చట్ పట్ తయారీ విధానం : ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో చికెన్ ముక్కలు, పెరుగు, అల్లంవెల్లుల్లి మిశ్రమం, కారంపొడి, ఉప్పు, గరంమసాలా, ఫుడ్ కలర్ అన్నింటినీ బాగా కలిపి అరగంటసేపు నానబెట్టండి.

SHARE


చికెన్ చట్ పట్ తయారీ విధానం
కావలసిన పదార్థాలు :
బోన్ లెస్ చికెన్ ముక్కలు: 500 గ్రా., గరంమసాలా: 5 గ్రా., అల్లంవెల్లుల్లి ముద్ద: 25 గ్రా., రిఫైన్డ్ ఆయిల్: 50 గ్రా., ఉల్లిపాయలు: 100 గ్రా., కారంపొడి: ఒక టీస్పూన్, పెరుగు: 100 గ్రా., ఉప్పు: తగినంత, ఫుడ్ కలర్: చిటికెడు

తయారుచేయు విధానం :
ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో చికెన్ ముక్కలు, పెరుగు, అల్లంవెల్లుల్లి మిశ్రమం, కారంపొడి, ఉప్పు, గరంమసాలా, ఫుడ్ కలర్ అన్నింటినీ బాగా కలిపి అరగంటసేపు నానబెట్టండి.

ఇప్పుడు ఒక బాణలిలో నూనెపోసి కాగిన తర్వాత ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేడిచేయండి. ఆ తర్వాత మసాలాలో నానబెట్టిన చికెన్ ముక్కల్ని కలిపి బాణలిలోని నీళ్లన్నీ ఆవిరైపోయేంతవరకు ఉడికించి పొడిగా కొద్దిసేపు ఫ్రై చేయండి. అంతే వేడివేడి చికెన్ చట్ పట్ తయారు.