Home News

అధికారపక్షంలోను చెవిరెడ్డి అదే దూకుడు…!

SHARE

అసెంబ్లీలో ఆందోళనలు … ఎన్నికలప్పుడు ఘర్షణలు… పోలీసుస్టేషన్ల ముందు బైఠాయింపులు.. ఇలా తనదైన దూకుడుతో ఫోకస్‌ అవుతుంటారాయన .. ఇప్పుడు పవర్‌లోకి వచ్చాక కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారా? దశాబ్దల నాటి సమస్యలకు తనదైన శైలిలో చెక్‌ పెట్టాలని చూస్తున్నారా? … ఆయన చూపిస్తున్న స్పీడ్‌పై ప్రజల్లో చర్చ ఎలా ఉన్నా.. సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి… సదరు నేత తీసుకుంటున్న నిర్ణయాలు వికటిస్తాయేమో అన్న ఆందోళన కనిపిస్తోంది వారిలో …

చెవిరెడ్డి భాస్కరరెడ్డి… చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు .. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రత్యర్ధులను ఒకరేంజ్లో టార్గెట్‌ చేసే ఆయన .. ఎప్పుడూ వివాదాల్లోనే ఉండేవారు.. వయస్సు, హోదాలతో నిమిత్తంలేదు .. ఎంతటివారి మీదైనా మాటల తూటాలు పేల్చేవారు .. తన మీద చాలా కేసులు ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పుకుంటారు… అవన్నీ ప్రజల కోసం చేసిన పోరాటాల్లో పెట్టిన కేసులు మాత్రమే అని ఆయన ఫీలింగ్.

అయితే నిరంతరం జనంలో ఉండటమే .. తన రాజకీయ వ్యూహంగా రెండో సారి కూడా భారీ మెజార్టీతో గెలవగలిగారు.. ఎమ్మెల్యేగా గెలవడం , ప్రభుత్వ విప్‌, తుడా ఛైర్మన్‌ పదవులు పొందడం.. ప్రమాణాస్వీకారాలు చేయడం చకచకా జరిగిపోయాయి .. పదవులు స్వీకరించాక కూడా ఆయన దూకుడు తగ్గినట్లు కనిపించడం లేదు … అయితే ఆ స్పీడ్‌ సమస్యల పరిష్కారంలో చూపించే ప్రయత్నం చేస్తూ … అటు జనంలో, ఇటు పార్టీలో చర్చల్లో వ్యక్తవుతున్నారు ..

గతంలో తుడా ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది చెవిరెడ్డికి … పూర్తిస్ధాయిలో తుడా పరిధిని తెలియడంతో ఆ అనుభవాన్ని ఉపయోగిస్తూ … కీలాకాంశలపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయాలు తీసుకుని… తెగకోట్టేస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నారు … స్థానిక పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరక .. శెట్టిపల్లె భూముల వివాదం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉంటూ వచ్చింది … అలాంటి సమస్యకు చిటికెలో పరిష్కారం లభించేలా చేశారు.. అఖిలపక్షం మీటింగ్‌ పెట్టి , అన్ని పార్టీల నాయకులను ఒప్పించి శెట్టిపల్లెలో మెగా టౌన్‌షిప్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేయగలిగారు …
అదే దుకూడుతో సురప్పకాసంలో ప్రాజెక్ట్‌కు ఓకే చేయించారు … ఇక తుడా పరిధిలోని పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, ఎమ్మార్వో కార్యలయాల్లో రిసెప్షన్ సెంటర్ పేరుతో భవనాలను ప్రయోగత్మకంగా నిర్మింపచేస్తామంటున్నారు …

ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలకు చెవిరెడ్డి దుకూడుతో పరిష్కారం లభిస్తుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు … అయితే పార్టీలో కేడర్ మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది .. సున్నితమైన సమస్యలను పరిష్కారించే విషయంలో జాగ్రతగా అడుగులు వేయాల్సి ఉటుందని.. దూకుడు ప్రదర్శిస్తూ ఏకపక్షంగా పోతే తుడా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో పార్టీపై అది ప్రభావం చూపుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ..