Home News Politics

చంద్రబాబు సొంత నియోజకవర్గానికి అభ్యర్ది ఖరారు…

SHARE

సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు. 1994 నుంచి కూడా ‘నారా’ వారికి ఈ జిల్లా కొరకరాని కొయ్యగా మారింది. 1999లో రాష్ట్రం మొత్తం టీడీపీ ప్రభంజనం బలంగా ఉన్నా సొంత జిల్లాలో మాత్రం చతికిలపడింది. అప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ ఆదిపత్యం కనబరిచాయి. దీంతో ఎనిమిది నెలలు ముందుగానే జిల్లా పై దృష్టిపెట్టారు సీఎం చంద్రబాబు.

చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు చంద్రబాబు కు ఎప్పుడు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఎంతగా పట్టుసాధించాలని ప్రయత్నించిన అంతకంతకు దూరం అవుతున్నాయి. వీటిలో చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి ఒకటి. ఇక్కడ కూడా టీడీపీకి గత 15 సంవత్సరాలుగా పట్టు దొరకట్లేదు. ఎన్టీఆర్ ప్రభంజనంలో 1983లో ఓటమి తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇక్కడ నుంచి పోటికి ఆసక్తి చూపక కుప్పం కి షిఫ్ట్ అయ్యారు.

గత ఎన్నికల ముందు గల్లా అరుణకుమారి వంటి బలమైన నేత పార్టీలో చేరి పోటీ చేసినా స్వల్ప తేడాతో ఓటమి చవి చూడాల్సివచ్చింది. ఆ నిస్పృహకు తోడు, నామినేటెడ్‌ పదవి రాకపోవడంతో అరుణకుమారి కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వుంటున్నారు.కొన్ని నెలల కిందట ఆమె ఇన్‌ఛార్జి పదవి నుంచీ తప్పుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని అధినేతతో చెప్పేశారు. అధిష్టానం ఆమెకు పొలిట్‌ బ్యూరో సభ్యత్వం కట్టబెట్టినా వచ్చే ఎన్నికల్లో పోటీ మాత్రం చేయనని స్పష్టత ఇచ్చేశారు. దీంతో అక్కడ నాయకత్వ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో 8 నెలలు ముందుగానే చంద్రగిరిపై ప్రత్యేక దృష్టి సారించిన టీడీపీ చీఫ్ వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచీ జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

దీంతో పాటు బాబుకు అంతుపట్టని మరో నియోజకవర్గం పీలేరు. చంద్రగిరి,పీలేరు రెండూ రాజకీయంగా జిల్లాలో కీలకమైన, ప్రాధాన్యత కలిగిన నియోజక వర్గాలు. పీలేరులో కూడా టీడీపీ గత నాలుగు ఎన్నికల్లో వరుస ఓటములతో చతికిలబడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పీలేరులో పార్టీ గెలవాలనే పట్టుదలతో అధినేత చంద్రబాబు వ్యూహరచన చేశారు. అందులో భాగంగా నల్లారి కుటుంబానికి చెందిన కిశోర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించడంతో పాటు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నామినేటెడ్‌ పదవి కూడా కట్టబెట్టారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం బలంగా ఉండటంతో ఈసారి ముందుగానే ఇక్కడ క్యాండెట్ ని డిసైడ్ చేశారు చంద్రబాబు.
చంద్రగిరిలో పులివర్తికి పీలేరులో నల్లారికి ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ అధిష్టానం ఆదేశించడంతో ఈ నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ పీక్స్ కి వెళ్ళింది.