Home News Politics

బాబు ఢిల్లీ టూర్ లో ఉండగానే ఈడీతో షాకిచ్చిన మోడీ….

SHARE

తాజా రాజకీయ పరిణామాలు సూస్తే చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఏం సాధించారో కానీ మరో రకంగా ప్రధాని మోడీ బాబుకు ఎర్త్ పెట్టాడు. సీబీఐ ప్రక్షాళనకు దోవల్ ని రంగంలోకి దింపి సీవీసీని దారికి తెచ్చుకున్న మోడీ తర్వాత ఈడీ పై టార్గెట్ చేశాడు. అయితే సీబీఐలో వివాదం రచ్చగా మారడంతో ఈడీ లో వరకు సైలెంట్ గా పని చక్కబెట్టేశారు . పొలిటికల్ ఆర్ధిక నేరాలకు సంభందించి సీబీఐ కంటే ఈడీ పవర్ ఫుల్ కావడం బాబుకు సంభందించిన కేసులు దీనిలో ముడిపడి ఉండటంతో ఆ దిశగా స్కెచ్ గిశారు ఢిల్లీ బాసులు.

మానీలాండరింగ్ కేసులను విచారించడంలో దిట్టయిన ఈడీలో కూడా తన మార్క్ చూపించాలనుకున్న మోడీ ఇప్పుడు ఆ పని మొదలెట్టేశాడు. ఎన్ ఫోర్స్ మెంట్ లో చంద్రబాబుకి సంభందించిన బలమైన శక్తులు ఉన్నాయని భావిస్తున్న కమలం కోటరీ ఇప్పుడిక ఈడీలో ఆపరేషన్ షూరూ చేసింది. ఈ మధ్య వైసీపీ నాయకులు వంటి కాలి పై విరుచుకుపడుతున్న ఇద్దరు అధికారులు ఈడీలో బలమైన స్థానాల్లో తిష్టవేసి బాబుకి కొమ్ము కాస్తున్నారన్న విషయం పై దృష్టిసారించిన మోడీ లెక్క సరిచేసే పనిలో పడ్డాడు. చాలా పెద్ద తలకాయల పైన ఉన్న కేసులను కూడా ఈ బృందం అడ్డంగా తొక్కేసిందన్న ఆరోపణలున్నాయి. ఈ అధికారులకు అండగా ఉంది ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న చీఫ్ కర్నాల్ సింగ్ అటా…

ఇప్పటికే సీబీఐ వ్యవహారంలో సరిగ్గా డీల్ చేయక చేతులు కాల్చుకున్న కమళదళం ఈడీ డైరక్టర్ పదవీ విరమణ చేస్తుండటంతో చూసి చూడనట్లు వదిలేసింది. కర్నాల్ సింగ్ ఎక్స్ టెన్షన్ అడగ్గా అంత సీన్ లేదంటూ తరిమేసిన మోడీ టీం మరో పెద్ద తలకాయ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్ పై దృష్టి పెట్టింది. ప్రత్యేకించి బీజేపీ నేతలకి సంభందించిన కేసుల్లో రాంగ్ ట్రాక్ లో వెళ్తున్న ఈ క్యాండెట్ కూడా ఇక్కడ ఉండటం కరక్ట్ కాదనుకున్న మోడి టీం ముందుగానే ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ సింగ్ కి ఒక నోటీస్ పడేసింది. అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ ఆయన స్థానంలో ఢిల్లీ ఆదయపు పన్ను శాఖ కమీషనర్ ఎస్ కే మిశ్రాని నియమించింది. అయితే మిశ్రా చిన్న కేడర్ ఉద్యోగి కావడంతో కేంద్ర అదనపు కార్యదర్శి హోదాలో ఆయన్ని చేర్చేందుకు సీరియస్ గా ట్రై చేస్తుంది. ఈవిధంగా మోడీ చంద్రబాబుకు అనుకూలంగా కీలక పోస్టుల్లో చక్రాలు తిప్పుతున్న వారిని అంతే స్పీడ్ గా లూప్ లైన్లలోకి పంపుతున్నారు. ఈ పరిణామాలని నిన్న చంద్రబాబు మీడియా మీట్ అంటూ ఢిల్లీలో హడావిడి చేస్తున్న టైంలోనే ఇది జరగడం వీశేషం.

ఇక చంద్రబాబు ఢిల్లీ టూర్ కూడా సెల్ఫ్ గోల్ లాగానే కనబడుతుంది. జగన్ పై దాడి జరిగిన వెంటనే హుందాగా వ్యవహరించక ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసిన చంద్రబాబు ఢిల్లీ లెవల్లో జగన్ ని ప్రోజెక్ట్ చేసేందుకు తప్ప దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. చంద్రబాబు ప్రెస్ మీట్ ని జాతీయ చానల్స్ కూడా పట్టించుకోలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రం పై కుట్ర పన్నుతున్నారని తన పై కూడా ఐటీ,సీబీఐ దాడులు చేయిస్తారంటు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళీ ముందస్తు చెప్పుకొచ్చినట్లుంది. ఇక తెలంగాణలో పొత్తుల వ్యవహారం పై కూడా కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు జరిపి ఆర్ధిక సహకారం పై హామి ఇచ్చివచ్చినట్లు తెలుస్తుంది.