Home News Politics

సీబీఐ మాజీ జేడీ బీజేపీలోకేనా?

ల‌క్ష్మినారాయ‌ణ‌ సీఎం అభ్య‌ర్థి అవుతారా?

ల‌క్ష్మినారాయణ‌. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయ‌ణ‌. తెలుగురాష్ట్రాల్లో ఓ అధికారి పేరు అంత‌గా పాపుల‌రైంది ఆయ‌న‌తోనే. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల‌కేసు, బ‌ళ్లారి ఇనుప‌ఖ‌నిజం అక్ర‌మ త‌వ్వ‌కాల కేసుల విచార‌ణ‌తో ఫేమ‌స్ అయిపోయారు ఆ అధికారి. మ‌హారాష్ట్ర ఐపీఎస్ క్యాడ‌ర్‌కి చెందిన ఆ అధికారి త‌ర్వాత అక్క‌డికి వెళ్లిపోయినా మ‌న‌సంతా తెలుగురాష్ట్రాల‌పైనే. ఓ ద‌శ‌లో ఆయ‌న తెలంగాణ‌న క్యాడ‌ర్‌కి వ‌చ్చేందుకు ఆస‌క్తిచూపించినా అనుమ‌తి ల‌భించ‌లేద‌ని చెప్పుకున్నారు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి స‌ర్వీస్ నుంచి వైదొలిగారు సీబీఐ మాజీ జేడీ.

రాజ‌కీయాల‌పై ఆస‌క్తితోనే లక్ష్మినారాయ‌ణ ఉన్న‌తోద్యోగాన్ని వ‌దులుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. పోలీసు అధికారిగా ఉండ‌గానే స్టూడెంట్స్‌తో ఇంట‌రాక్ష‌న్‌తో పాటు అడ‌పాద‌డ‌పా ఏవో ఒక కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తూనే వ‌చ్చారు ల‌క్ష్మినారాయ‌ణ‌. యూనిఫాం స‌ర్వీస్‌కి గుడ్‌బై చెప్ప‌టంతో ఖాకీ చొక్కా స్థానంలో ఖ‌ద్ద‌రేయ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది. ప్ర‌జా స‌మ‌స్య‌లే త‌న ఎజెండాగా ఆయ‌న చెప్పుకుంటున్నా..చివ‌రికి ఏ జెండా కిందికి చేర‌తార‌న్న‌దే స‌స్పెన్స్.

ల‌క్ష్మినారాయ‌ణ సొంతంగా ఓ పార్టీ పెడ‌తార‌నీ..ఇప్ప‌టికిప్పుడు పార్టీ రిజిస్ట్రేష‌న్ అంటే ఫార్మాలిటీస్ అన్నీ పూర్త‌య్యేస‌రికి ఆల‌స్యం అవుతుంద‌నే ఆలోచ‌న‌తో వైసీపీ త‌ర‌హాలోనే ఓ రిజిస్ట‌ర్డ్ పార్టీని సొంతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేశార‌నే ప్ర‌చారం ఉంది. అయితే ఆ సంప్ర‌దింపులు ఫ‌లించ‌క‌పోవటంతో ఓ ద‌శ‌లో జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క‌లుస్తార‌ని భావించారు. టీడీపీ కూడా ల‌క్ష్మినారాయణ‌కు ప‌చ్చ‌కండువా క‌ప్పే ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని కూడా చెప్పుకున్నారు. అయితే తాను ఏ పార్టీలో చేర‌బోవ‌డం లేద‌న్న సీబీఐ మాజీ జేడీ..ప్ర‌జ‌ల్ని క‌లుసుకుంటూ వారి సాధ‌క‌బాధ‌కాలు తెలుసుకుంటున్నారు.

ఏపీ బీజేపీ కొత్త అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ చేసిన ప్ర‌క‌ట‌న‌తో సీబీఐ జేడీ క‌మ‌లం పార్టీలో చేర‌తార‌నే ఊహాగానానాలకు బ‌లం చేకూరింది. ఐపీఎస్ ల‌క్ష్మినారాయ‌ణ కోసం బీజేపీ మొద‌టే ప్ర‌య‌త్నం చేసింద‌నీ..సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌నే డిమాండ్‌పైనే త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంద‌ని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు క‌న్నా చేసిన ప్ర‌క‌ట‌న ఆ వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా ఉంది. మోడీ, అమిత్‌ షా.. ఇద్దరు లక్ష్మీనారాయణల్లో ఎవరిని నిర్ణయిస్తే వారే సీఎం అవుతారని సైలెంట్‌గా సంచ‌ల‌న విష‌యం చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ.

ఇప్ప‌టిదాకా సీబీఐ మాజీ జేడీ తాను బీజేపీలో చేర‌తాన‌ని చెప్ప‌క‌పోయినా, ఆయ‌న పార్టీలోకొస్తార‌ని బీజేపీ వైపునుంచి ఎలాంటి సంకేతాలు లేక‌పోయినా…ఇప్పుడు క‌న్నా ఏకంగా ఆయ‌న సీఎం అభ్య‌ర్థి రేసులో ఉన్నార‌ని చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం సృష్టి|స్తోంది. సో…ఐపీఎస్ ఎక్స్ బాస్ క‌మ‌లం పార్టీలోకేన‌న్న‌మాట‌.