Home News Updates

జస్టిస్ నూతి రామ్మోహన్ రావు పై కేసు నమోదు

SHARE

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు పై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..

కోడలు సింధు శర్మను వేధించిన కేసులో ఆయనపై 354 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు..

నూతి రామ్మోహన్ రావు తో పాటు ఆయన కుమారుడు వశిష్ట, భార్యపై పోలీసులు ఇదివరకే 498a కింద కేసు నమోదు చేశారు..

తనపై భౌతిక దాడికి పాల్పడిన దృశ్యాలను నూతి రామ్మోహన్ రావు కోడలు సిసిఎస్ పోలీసులకు నెల రోజుల క్రితం అందించారు..

దీంతో పోలీసులు అదనంగా 354 సెక్షన్ ను వారం రోజుల క్రితం నమోదు చేశారు.