Home Entertainment Cinema

బన్నీ మళ్లీ వక్కంతంనే నమ్ముతున్నాడా..!

SHARE

అల్లు అర్జున్‌ గత చిత్రం ‘నా పేరు సూర్య’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రంతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెల్సిందే. రచయితగా మంచి సక్సెస్‌లను దక్కించుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా మాత్రం సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. బన్నీ పడ్డ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయ్యింది. తనకు ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడిని ఏ హీరో కూడా అంత త్వరగా నమ్మడు. కాని అల్లు అర్జున్‌ మాత్రం ఇంకా వక్కంతం వంశీపై నమ్మకంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. తన తదుపరి చిత్రంకు సంబంధించిన వర్క్‌ను ఆయనకు అప్పగించినట్లుగా ఇండస్ట్రీ టాక్.

‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలైన వెంటనే తమిళ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో బన్నీ ఒక చిత్రం చేయాల్సి ఉంది. కాని బన్నీ సినిమా ప్రారంభం విషయంలో ఆలస్యం చేస్తున్నాడు. బన్నీ తదుపరి చిత్రం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో ఒక చిత్రాన్ని చేసేందుకు బన్నీ ముందుకు వచ్చాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. స్క్రిప్ట్‌ వర్క్‌లో వక్కంతం వంశీని భాగస్వామిగా అల్లు అర్జున్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది.

కథలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను సందర్బానుసారంగా క్రియేట్‌ చేయడంలో వక్కంతం వంశీకి మంచి పట్టు ఉంది. అందుకే అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ బాధ్యతను వక్కంతం వంశీపై పెట్టినట్లుగా తెలుస్తోంది. బన్నీ తదుపరి చిత్రం విషయంలో అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దర్శకుడిగా వక్కంతం వంశీ మరో ప్రయత్నం చేసుకుంటూనే ఇతర దర్శకులకు స్క్రిప్ట్‌ వర్క్‌లో సాయం చేస్తున్నాడు.