Home News Politics

ఈ నెల 13న తెలంగాణా లో అమిత్ షా పర్యటన

ఈ నెల 13న తెలంగాణా లో అమిత్ షా పర్యటన

SHARE


వివిధ రాష్ట్రాల్లో బిజీ కార్యక్రమాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. అమిత్ షా ఈ నెల 13న తెలంగాణా లో పర్యటించనున్నారు. ప్రస్తుతం తెలంగాణా లో పర్యటిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు డా కే లక్ష్మణ్ జన చైతన్య యాత్రకు మంచి స్పందన వస్తుండటంతో కమల దళంలో ఉత్సాహం పెరుగుతోంది.

ఈ నెల 13న తెలంగాణా లో అమిత్ షా పర్యటన

లక్ష్మణ్ తో శనివారం ఫోన్ లో మాట్లాడిన అమిత్ షా తన పర్యటన గురించి ఖరారు చేసినట్లు బాజాపా వర్గాలు తెలిపాయి. జన చైతన్య యాత్రని కొనసాగించాలని, దీనికి కేంద్ర పార్టీ పూర్తీ సహకారం అందిస్తుందని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.యాత్ర ఎన్ని నియోజక వర్గాల్లో పూర్తయింది? ఏ ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు అన్న అంశాలపై అమిత్ షా లక్ష్మణ్ ని అడిగారు.