Home News Politics

బీజేపీ ఆకర్ష్ కి టీ కాంగ్రెస్ కుదేలు…!

SHARE

తెలంగాణ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ తగిలింది.. డికె అరుణ బిజెపిలో చేరి కాంగ్రెస్‌ను ఉలిక్కిపడేలా చేశారు.. సీనియర్ల మధ్య సమన్వయ లోపం వల్లే డీకే అరుణ పార్టీ వీడినట్లు కనిపిస్తున్నా .. ఇదంతా బిజెపి వ్యూహమే అంటున్నారు.. తెలంగాణలో నాయకులు కరువుఉన్న కాషాయపార్టీ సాధ్యమైనంత మంది సీనియర్లను పార్టీలో చేర్చుకోవడానికి స్కెచ్‌ గీసింది.. ఆ మేరకు ఇతర పార్టీ నేతలపై ఆకర్ష్‌ మంత్రం ప్రయోగించాలని బిజెపి హస్తిన పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం

బిజెపి ఆకర్ష్‌ మంత్రం తెలంగాణలో పనిచేయడం మొదలుపెట్టింది .. దాంతో ఇప్పటికే కుదేలవుతున్న కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల ముందు ఊహించని షాక్ లు తగులుతున్నాయి .. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యే లు పార్టీ కి హ్యాండ్ ఇచ్చి కారెక్కేశారు ..ఇప్పుడు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గద్వాల్ జేజమ్మ డీకే అరుణ బీజేపీ కండువా కప్పుకొని పెద్ద షాక్ ఇచ్చారు .. పిసిసి పెద్దలపై అసంతృప్తితో ఉన్న అరుణతో బిజెపి పెద్దల మంతనాలు సాగించి కాషాయ కుండువా కప్పేశారు…

మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ మారడానికి కారణం కేంద్ర మాజీ మంత్రి జై పాల్ రెడ్డి కారణమని … పీసీసీ సైతం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నా ఏ రోజు వారిని కూర్చోపెట్టి మాట్లాడిన సందర్భం లేదు..ఇలా పార్టీ లో సీనియర్ నాయకుల మధ్య వార్ జరుగుతుంటే తెలిసి కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం చేయలేదు మిగిలిని సీనియర్లు . . మరోవైపు మహబూబ్ నగర్ ఎంపీ టికెట్‌ జైపాల్ రెడ్డి సూచించిన వంశీచంద్‌రెడ్డికి టికెట్ ఇవ్వడంపై డీకే అరుణ రగిలిపోతున్నారు..

తెలంగాణలో నాయకుల కొరతతో అల్లాడుతున్న బిజెపి వలసలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. లోక్‌సభ ఎన్నికలకు సరైన అభ్యర్ధులను కూడా ఎంపిక చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర నేతలు ఉండటంతో బిజెపి హస్తిన పెద్దలు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు స్కెచ్‌ గీసారు.. వారి మంతనాలు ఫలించి అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీ.కే.అరుణ కాషాయ కండువా కప్పుకున్నట్లు సమాచారం..

అలాగే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి , మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, నారాయణ పేట నియోజకవర్గ నేత శివకుమార్‌రెడ్డి, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌, ఆయన కుమారుడు విక్రమ్‌గౌడ్‌లతో కూడా బిజెపి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.. ముఖేష్‌గౌడ్‌, విక్రమ్‌గౌడ్‌లకు ఇద్దరికీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా కూడా ఇస్తున్నారంట కమలనాథులు… అలాగే మల్కజ్‌గిరి ఎంపి టికెట్‌ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో కూడా టచ్‌లో ఉన్నారంట.. కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్తు ఉండదనే వీరంతా పక్కచూపులు చూస్తున్నట్లు కనిపిస్తోంది.. చూడాలి బిజెపి ఆకర్ష్‌ మంత్రానికి ఎంతమంది లొంగిపోతారో