Home Entertainment Cinema

కపుల్..కమెడియన్ మధ్య బిగ్ బాస్ లో బిగ్ ఫైట్…!

SHARE

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ షురూ అయింది. తొలివారం పూర్తి కావస్తుండటం ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గరపడుతుండటంతో ఇక బిగ్ బాస్ హౌస్ వార్ రూంలా మారింది. ఒకపక్క హేమా-రాహుల్ వివాదం నడుస్తుండగానే మరోపక్క కిచెన్ లో పునర్నవి,అలీ రెజా మధ్య చపాతి ముక్క చిచ్చుపెట్టింది. నిన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అన్న హేమా,శ్రీ ముఖిల మధ్య లగ్జరీ బడ్జెట్‌ అగ్గిరాజేసింది. ఇక అన్నిటి కన్నా హైలెట్ వరుణ్ సందేశ్, మహేష్ విట్టాల మధ్య ఫైటింగ్ ఇలా వారం తిరగకముందే హౌస్ రణరంగంగా మారింది.

ఇక షో స్టార్టింగ్ లోనే హేమా,రాహుల్ వార్ క్లోజ్ చేసేందుకు కంటెస్టెంట్స్ ప్రయత్నించగా.. మేం తగ్గేదే లేదంటూ రెచ్చిపోయారు ఇద్దరు. నాగార్జున గారు రాగానే నీ సంగతి తేలుస్తా అంటూ రాహుల్ కి వార్నింగ్ ఇచ్చింది హేమా. అయితే హేమా దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు మహేశ్ విట్టా. ఆయన లెవల్ ఏంటి? మన ఈ పత్తి యాపారం ఏంటి? అని అదిరిపోయే డైలాగ్ తో హేమ నోరెళ్లబెట్టేలా చేశాడు.

ఇక కిచెన్ లో చపాతీ ముక్క చిచ్చురేపింది. నా చపాతి ముక్క సగం తినేశారు అంటూ పునర్నవి భూపాలం చేసిన హడావిడి అంత ఇంతా కాదు. నా సగం చపాతీని అలీ రెజా సగం తినేశారు అంటూ హడావిడి చేసింది. ఇక బయట ఉన్న అలీని హేమా అలర్ట్ చేయడంతో నేను ఎక్కడ తిన్నా.. తిన్నది నేను కాదు. బాబా భాస్కర్ అంటూ అసలు నిజం చెప్పారు అలీ. కర్రీ నచ్చి నేనే రెండు చపాతీలు తిన్నానని బాబా భాస్కర్ చేసిన కామెడీ హౌస్ ని కూల్ చేసింది. అలీ పై అంతెత్తున ఎగిరిన పునర్నవి ఓ మీరు తినేశారా అంటూ బాబా భాస్కర్ కి ఓ స్మైల్ ఇచ్చి మిగిలిని చపాతీని లాగించేసింది.

హేమ, జాఫర్‌ల బాహుబలి డ్రామా బిగ్ బాస్ ని కన్విన్స్ చేయడంతో లగ్జరీ బడ్జెట్ సాధించారు. అయితే వారానికి సరిపడ సరుకులు సాధించడంలో ఫెయిల్ అయ్యారు కంటిస్టెంట్స్. దీనికి కారణం శ్రీముఖే అంటూ హేమ చేసిన రచ్చ వారిద్దరి స్నేహానికి గండికొట్టింది. ఆ టైంలో శ్రీముఖి కిచెన్ లో ఉండటం టీవీ రిమోట్ తన దగ్గర ఉన్నా మహేశ్ టీవీ ఆన్ చేయకపోవడంతో ఇది మరో వివాదనికి అగ్గి రాజేసింది.

ఇక అసలు సిసలు సీరియస్ ఫైట్ మాత్రం వరుణ్ సందేశ్, మహేష్ విట్టాల మధ్య ఫైటింగే. మహేశ్ నన్ను లోపలికి వెళ్ళు అని బెదిరిస్తున్నాడని వరుణ్ భార్య వితిక షెరు గట్టిగా అరవడంతో సీన్‌లో ఎంటరయ్యాడు వరుణ్ సందేశ్.
ఏయ్.. నా పెళ్లాన్ని పో అంటావా? సిగ్గులేనోడా? అంటూ మహేష్‌ని కొట్టేందుకు మీదకు వెళ్ళాడు వరుణ్ సందేశ్. మహేష్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా.. వరుణ్ మీదికి పోవడంతో అదే రేంజ్ లో స్పందించాడు మహేష్. ఈ ఇద్దరూ రారా.. అంటే రారా అని కొట్టుకోవడానికి సిద్ధమవ్వగా మిగిలిన కంటెస్టెంట్స్ ఆపే ప్రయత్నం చేశారు. వితికా కూడా గట్టిగా అరుస్తూ మహేష్‌పైకి వెళ్లింది. ఈ గొడవ ఏ రేంజ్ కి చేరిందన్నది ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.