Home Entertainment Cinema

బిగ్ బాస్ ఎలిమినేషన్ కు నామినేషన్స్ షురూ…ఎలిమినేషన్ కి ఎంపికైంది వీరే…!

SHARE

బిగ్ బాస్ రెండో వారం మళ్ళీ సస్పెన్స్ కి తెరలేపింది. ఎలిమినేషన్ కి నామినేషన్స పూర్తవ్వడంతో మళ్ళీ 15 మందిలో ఒకరికి కౌంట్ డౌన్ స్టార్టయింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా హౌస్‌లో అడుగుపెట్టిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి మల్లేపులు పెట్టుకుని మాస్ స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి వస్తూనే గ్రూపులతో గేమ్ స్టార్ట్ చేసింది. ఎలిమినేషన్ నామినేషన్స్ లో బాబా భాస్కర్ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈరోజు నుంచి హౌస్ లో వాటర్‌తో పాటు గ్యాస్‌ని కూడా బిగ్ బాస్ నిలిపివేస్తాననడంతో హౌస్ లో ఏం జరుగుతుందన్న దాని పై మరింత సస్పెన్స్ పెరిగింది.

ఇక హౌస్ లోకి వస్తూనే గ్రూపులు స్టార్ట్ చేసిన తమన్నా సింహాద్రి బాబా భాస్కర్, జాఫర్ తోనే తాను ఉంటానంటూ బాంబు పేల్చింది. మహేశ్ తో వ్యవహరించిన తీరు పై వరుణ్,వితికాల పై కూడా సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఎలిమినేషన్స్‌ కోసం నామినేషన్ నిర్వహించాడు బిగ్ బాస్. ఒక్కో కంటిస్టెంట్ విడివిడిగా తమ అభిప్రాయాలను కన్ ఫెషన్ రూంలో పంచుకున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నాకు నామినేట్ చేసే అవకాశం దక్కలేదు. ఇక నామినేషన్ ప్రారంభమైన తరువాత ఎవరితోనూ చర్చించకూడదనే నిబంధనను పాటించని వరుణ్ సందేశ్ భార్య వితిక ను నామినేషన్ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించారు బిగ్ బాస్.

మిగిలిన 13 మందిలో మొదట హిమజ పునర్నవి, రాహుల్ ని ఎలిమినేషన్ కి నామినేట్ చేయగా, వరుణ్ జాఫర్, శ్రీముఖి ని నామినేట్ చేశాడు. అషూరెడ్డి శ్రీముఖి, రాహుల్ ను …రాహుల్ హిమజ, శ్రీముఖి ని నామినేట్ చేశారు. శివజ్యోతి శ్రీముఖి,జాఫర్ ని, అలీ రెజా హిమజ, వరుణ్ సందేశ్ ని నామినేట్ చేశారు. రవిక్రిష్ణ.. హిమజ,జాఫర్ ని జాఫర్ వితిక, మహేష్ ని నామినేట్ చేశారు. రోహిణి రితిక, మహేష్ ని, మహేష్ విట్టా వితిక, వరుణ్ సందేశ్ ని నామినేట్ చేశారు. శ్రీముఖి హిమజ, మహేష్ విట్టా ని, పునర్నవి హిమజ, శ్రీముఖిని,తమన్నా వరుణ్ సందేష్, వితిక ని ఎలిమినేషన్ కి నామినేట్ చేశారు.

బాబా భాస్కర్ మాత్రం తాను ఎవరిని నామినేట్ చేయనంటూ కంటిస్టెంట్స్ అందరిపై సాఫ్ట్ కార్నర్ చూపాడు. కావాలంటే నన్ను నామినేట్ చేసుకోండి అంటూ బిగ్ బాస్ కి షాక్ ఇచ్చాడు బాబా భాస్కర్. ఇద్దరి పేర్లు చెప్పమని బిగ్ బాస్ కన్విన్స్ చేసినా ఒప్పుకోలేదు భాస్కర్. ఎంత చెప్పిన వినకపోవడంతో నామినేషన్ క్యాన్సిల్ చేసి హౌస్ మొత్తాన్ని ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తానని బిగ్ బాస్ బెదిరించడంతో మెత్తబడ్డాడు బాబా భాస్కర్. చివరాకరుకు వితిక, రాహుల్ పేర్లను చెప్పారు.

చివరికి ఈ మొత్తం నామినేషన్ ప్రక్రియలో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు ఈవారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఎక్కువమంది మాత్రం శ్రీముఖి, హిమజలను నామినేట్ చేశారు. ఒకేసారి ఎనిమిది మంది ఈసారి నామినేట్ కావడం ఈసారి విశేషం. ఇక హౌస్ లో వాటర్ ,గ్యాస్ కట్ చేసి హౌస్ లో కంటిస్టెంట్లకు షాకిచ్చాడు బిగ్ బాస్. ఇదే సస్పెన్స్ ఈ రోజు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.