Home Entertainment Cinema

బిగ్ బాస్ హైలెట్స్: వరుణ్ వితికాల మధ్య చిచ్చురేపిన సైకిల్ టాస్క్…!

SHARE

బిగ్‌బాస్‌ హౌస్‌లో 10వ రోజు కంటిస్టెంట్స్ కి ఎక్కడా లేని కష్టాలు వచ్చి పడ్డాయి. హౌస్ లో నిత్యవసరాలైన వాటర్,గ్యాస్ కోసం బిగ్ బాస్ కండీషన్లు పెట్టడంతో రచ్చ మొదలైంది. ఇవి కావలంటే సైక్లింగ్ టాస్క్ చేయాలంటూ షరతులు విధించాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో ఉన్న కపుల్ వరుణ్,వితికాల మధ్య గిల్లికజ్జాలు, రవికృష్ణ పై తమన్నా రుసరుసలు, జాఫర్‌, మహేష్‌,తమన్నాలు కలిసి శ్రీముఖి ని టార్గెట్ చేయడం ఈ ఎపిసోడ్ లో హైలెట్ గా మారాయి….

గ్యాస్,నీళ్ల కోసం బిగ్ బాస్ ఇచ్చిన సైక్లింగ్‌ టాస్క్‌ ఇంట్లో చిచ్చు రేపింది. గ్యాస్‌, నీళ్లు, లగ్జరి బడ్జెట్ కోసం మూడు సైకిళ్లు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన బిగ్‌బాస్‌.. ఏ సైకిల్‌ తొక్కితే ఆ సైకిల్ కి సంభందించినవి కంటిన్యూగా వస్తాయని ట్విస్ట్ ఇచ్చాడు. మూడు సైకిళ్ల ను తెగ తొక్కెసిన కంటిస్టెంట్లు మధ్యలో నిప్పురాజేశారు. గ్యాస్‌కు సంబంధించిన సైకిల్‌ను పునర్నవి తొక్కినంత సేపు వంట గదిలో దోశలు వేస్తూ వితిక బిజీగా ఉంది. ఇక్కడే రగడ మొదలైంది.

మొదతగా శ్రీముఖి సైకిల్ ఎక్కడంతో ఒకరి తరువాత ఒకరు అని కాకుండా.. టీంలుగా డివైడ్ అయ్యి సైకిల్ తొక్కాలంది శివజ్యోతి. దీంతో నేనే ముందు సైకిల్ తొక్కుతా.. నైట్ పడుకోవాలని రచ్చ చేసింది తమన్నా సింహాద్రి. అందరూ టాస్క్‌లో పార్టిసిపేట్ చేస్తుంటే.. నువ్ ఒక్కదానివి వంటగదిలో ఉండటం కరెక్ట్ కాదు.. నువ్ కూడా రావాలి అంటూ పునర్నవి వితికాని ఎంటర్ టైన్ చేయడంతో నేను దోసెలు వేస్తుంటే..నువ్వు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావ్ అంటూ వితికా ఫైర్ అయ్యింది.

ఇక సీన్ లోకి ఎంటర్ అయిన వరుణ్ సందేశ్ సడన్ గా పునర్నవిని సపోర్ట్ చేయడంతో గుక్కెట్టి ఏడ్చేంది వితికా. వరుణ్ వితికాల మధ్య డిస్కషన్ పెరగడంతో మిగిలిన కంటిస్టెంట్స్ అలర్టై ఇద్దరిని కూల్ చేశారు. వరుణ్ వితికా కి క్షమాపణలు చెప్పడంతో హౌస్ చల్లబడింది. కూల్ అయిన వితికా కూడా వరుణ్‌కి సారీ చెప్పింది. పునర్నవి vs వితికా గొడవ సడన్ గా క్యూట్ కపుల్ వైపు మల్లడంతో అవాక్కాయ్యారు కంటిస్టెంట్స్.

దోశ విషయంలో చిన్న టెస్ట్‌ పెట్టామని.. ఈ టెస్ట్‌లో తమన్నా ఫెయిల్‌ అయిందని రవికృష్ణ సరదాగా అనడంతో తమన్నా ఫీల్‌ అయింది. ఆమెను రోహిణి, శివజ్యోతిలు ఓదార్చారు. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక.. రవిక్రిష్ణ మైక్‌లు దాచేసి ఉదయం అతనితో ఏమైందిరా పండు అంటూ ఆడుకుంది.

శ్రీముఖి పై కూడా గ్రూప్ డిష్కసన్ పెట్టారు జాఫర్ అండ్ టీం. ముందుగా తమన్నా శ్రీ ముఖి పై సెటైర్లు స్టార్ట్ చేసింది. శ్రీముఖి పెర్ఫామెన్స్‌ పై జాఫర్ మాత్రం అంత సీన్ లేదంటూ సింపుల్ గా తేల్చేశాడు. నేను ఆమె క్రేజ్ చూసి చాలా ఎక్స్ పర్ట్ చేశా కాని సీన్ లోకొస్తే అంత లేదంటూ జడ్జ్ చేశాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా మంచి ఎంగ్జైటి ఉండేలా నిన్నటి ప్రోమో చూస్తే తెలుస్తుంది. శివజ్యోతి,వరుణ్ సందేశ్ ల మధ్య వివాదం శివజ్యోతి కన్నీళ్ళు పెట్టుకోవడం మరింత రచ్చ రేపేలా ఉంది.