Home Entertainment Cinema

బిగ్ బాస్ లో సోషల్ వార్

SHARE

బిగ్‌బాస్ షో దాదాపు ముగింపునకు వచ్చేసింది. షో మొత్తం ఒక ఎత్తు… చివరి 3-4 వారాలు ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది. గొడవలు.. గ్రూపిజంతో ప్రేక్షకుడికి కావల్సినంత మసాలా అందిస్తున్నారు హౌస్‌మేట్స్. అయితే కొద్ది వారాల క్రితమే ఈ షో నుంచి దీప్తి నల్లమోతు వెళ్లిపోతుందని భావించారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆమెకు మిగిలిన వారితో పోలిస్తే బయట పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.

అయితే గత కొద్ది వారాలుగా ఆమె ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. కౌశల్‌కి దాదాపు 60 శాతం ఉంటే.. ఆమె 20శాతం ఓట్లను కొల్లగొడుతోంది. ఒక వారమైతే దాదాపు కౌశల్‌కి దగ్గరగా వచ్చేసింది. అయితే ఆమెదంతా ఫేక్ ఓటింగ్ అని ఓ కంపెనీతో టై అప్ అయి ఇలా ఓటింగ్ చేయించుకుంటోదనే వాదన బయట వినిపిస్తోంది. ఇదంతా దీప్తి భర్త శ్రీకాంత్ బయటి నుంచి నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌశల్ ఆర్మీ అయితే ఏకంగా ఆధారాలతో సహా విషయాన్ని వెల్లడిస్తోంది.

సోషల్ మీడియాలో దీప్తి ఓటింగ్‌కి సంబంధించిన లిస్ట్‌ను పోస్ట్ చేసింది. ఆమె.. రామ్ సొల్యూషన్స్‌తో టై అప్ అయిందని.. ఫేక్ ఐడీ ద్వారా ఓట్లు వేయించుకుంటోందని కౌశల్ ఆర్మీ అభియోగం. మరో వాదనను కూడా కౌశల్ ఆర్మీ సభ్యులు వినిపిస్తున్నారు. కౌశల్‌కి బుదవారం ఉదయానికి 80వేల దాకా ఓట్లు పోల్ అవుతుంటే దీప్తికి పదుల్లో ఓట్లు పోల్ అవుతున్నాయని.. మంగళవారం ఉదయం మాత్రం భారీగా ఓటింగ్ జరుగుతోందని పేర్కొంటున్నారు. దీన్ని బట్టి ఐటీ సొల్యుషన్ సభ్యులు రాత్రి వేళ ఉండరు కాబట్టి ఆమెకు ఓట్లు రావడం లేదు… ఉదయం రాగానే ఆమెకు ఫేక్ ఐడీలతో భారీగా ఓటింగ్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇది ఎంతవరకూ నిజమనే విషయం తెలియాల్సి ఉంది.