Home News Updates

బిగ్ బాస్ డే-6…కంటెంట్ చూపిన కలర్ బాయ్…శ్రీ ముఖి..రాహుల్ సంథింగ్ సంథింగ్…!

SHARE

దమ్మెంతో చూపించరో దెబ్బకి పాతళం బద్దలవ్వాల..ఆ రేంజ్ లో రెచ్చిపోయాడు బిగ్ బాస్ హౌస్ లో మహేశ్ విట్టా. నిన్నటి వరకు వార్ రూంగా ఉన్న హౌస్ లో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపించారు కంటిస్టెంట్స్. ఆరుగురు ఈవారం ఎలిమినేషన్ జోన్‌లో ఉండటం టైం దగ్గరపడుతుండటంతో షో పై మరింత ఆసక్తిగా మారింది. ఇక నిన్నటి సీన్ లోకి వెళ్తే పాత గొడవల కాక ఇంకా రేగుతూనే ఉంది. హేమ-సింగర్ రాహుల్‌ తమ క్లాష్ కంటిన్యూ చేస్తూండగా వరుణ్ తేజ్- మహేష్ విట్టాల గొడవ మరింత సెగలు పుట్టించింది. ఇక రాహుల్ శ్రీ ముఖి మధ్య రిలేషన్ షిప్ కూడా హౌస్ లో సంథింగ్ సంథింగ్ గా మారింది..

ఇక హౌస్ లోకి నాగర్జున అడుగుపెట్టబోతుండటంతో ఎలిమినేషన్ కి సెలక్టయిన ఆరుగురు కాస్త టెన్షన్ మోడ్ లోకి వెళ్లారు. ఈవారం ఎలిమినేషన్‌లో రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండటంతో కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. హౌస్ నుంచి బయటకు ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఫీవర్ నాగర్జున ఎంట్రీతో పీక్స్ కి వెళ్లనుంది.

ఇక నిన్నటి గొడవని కంటిన్యూ చేస్తూ మహేశ్ ని కొట్టేంత పని చేశారు వరుణ్ అండ్ వితికా. నాకు వితిక చెల్లెలు లాంటిదని సీమ యాసలో ఆ చనువు తో… పో అన్నా అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు మహేశ్ విట్టా. వరుణ్ వితికాలు మాత్రం తమకు మహేశ్ సారి చెప్పాల్సిదేనని పట్టుబట్టారు. ఆ మాటకు హర్ట్ అయితే సారి చెప్తా అన్నాడు మహేశ్. అయినా కపుల్ కాంప్రమైజ్ కాకపోవడంతో మహేశ్ కూడా ఓ రేంజ్ ఇద్దరి పై ఫైరయ్యాడు. మిగిలిన కంటిస్టెంట్స్ ఎలాగో మహేశ్ తో సారీ చెప్పించగా వరుణ్ మాత్రం అంత సాటిస్ ఫై అవ్వలేదు.

హీట్ పెంచిన బిగ్ బాస్ హౌస్‌లో వినోదాన్ని నింపేందుకు కంటెస్టెంట్స్‌కి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ‘కళాకారులం.. మేం కళాకారులం’ స్కిట్ తో హౌస్ సభ్యుల్ని రెండు టీమ్‌లుగా చేశారు. శ్రీముఖి స్కూల్.. ఇందులో వరుణ్, వితిక, రవిక్రిష్ణ, రోహిణి, హేమ, పునర్నవి, అషు సభ్యులుగా ఉండగా భాస్కర్ స్కూల్ లో అలీ రెజా, మహేష్ విట్టా, రాహుల్, బాబా భాస్కర్, జాఫర్, సావిత్రి, హిమజలు సభ్యులుగా స్కిట్ లు చించేశారు.

రవిక్రిష్ణ, రోహిణిలు డ్యాన్స్ తో ఇరగదీయగా, హేమ, శ్రీముఖిలు దెయ్యం కొంపలో కామెడీ కపుల్స్ గా ఆకట్టుకున్నారు. ఓన్లీ వన్స్ ఫసక్ అంటూ శ్రీముఖి తన మార్క్ చూపించింది. ఇక భాస్కర్ స్కూల్ నుంచి రైతు, పల్లెటూరు నేపథ్యంలో మంచి స్కిట్ తో పెర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా రైతుగా నటించిన మహేష్ విట్టా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. రంగస్థలం టైటిల్ సాంగ్ పాడుతూ రైతుని, పంట పొలాలను చులకన చేసే వాళ్ల దుమ్ముదులిపేశాడు.

మహేష్ తో పెట్టుకుంటే మడతెడిపోద్దా? అన్న రేంజ్ లో తన మార్క్ డైలాగ్స్,కామేడీతో హౌస్ లో ఫస్ట్ టైం సూపర్ అనిపించుకున్నాడు. ఇక శ్రీ ముఖి రాహుల్ మధ్య మ్యాటర్ కూడా ఇంట్రస్టింగ్ గా మారింది. నా బెస్ట్ ఫ్రెండ్ వి నా మీద ఎందుకు అరిచావ్ అంటూ శ్రీ ముఖి…ఫ్రెండ్‌వి కాబట్టే అరిచా అంటూ రాహుల్ కన్వెన్సింగ్ సంథింగ్ సంథింగ్ లా సాగిపోయింది.

మొత్తనికి హౌస్ వార్ రూం నుంచి ఎంటర్‌టైన్మెంట్ యాంగిల్ లోకి మారింది. ఇక వీకెండ్ ఎలిమినేషన్ టెన్షన్ మాత్రమే కంటిస్టెంట్స్ మధ్య కాక పుట్టిస్తుంది.