Home Entertainment Cinema

మాజీ మంత్రిగారి కూతురే ఈ తమన్నా సింహాద్రి…!

SHARE

బిగ్ బాస్ లో ఎంట్రీ తో తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది తమన్నా సింహాద్రి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంగళగిరి నుంచి లోకేశ్ పై పోటీకి సైతం దిగిన తమన్నా కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. తమన్నా సింహాద్రి ది కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం. తండ్రిపేరు సింహాద్రి నాగేశ్వరరావు. ఈయన రైతు. తమన్నా పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ మాజీ మంత్రి అప్పట్లో టీడీపీకి దివిసీమలో కీలక నేత. తమన్నా మాత్రం శ్రీ రెడ్డి వివాదంతో ఫేమస్ అయింది.

పుట్టుక మగ అయినా చిన్నప్పటి నుంచి ఆడపిల్లగా ఉండాలనే కోరిక ఉండేది. ఈ సినిమాలంటే పిచ్చి,నటించాలనే కోరిక తో హైదరాబాద్ వచ్చింది. అక్కడి నుంచి కొందరి పరిచయంతో ముంబై చేరింది తమన్న. అక్కడ ఆపరేషన్ తో పూర్తిగా ఆడపిల్లలా మారిపోయింది. ముంబైలో వీకేర్ కంపెనీ నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. ఇక తర్వాత మళ్లీ హైదరాబాద్ కి మాకాం మార్చింది.

హైదరాబాద్ లో శ్రీరెడ్డితో తమన్నాకు పరిచయం ఏర్పడింది. శ్రీరెడ్డి వివాదం సమయంలో ఆమె ఉద్యమానికి సహకరించింది. పవన్ కళ్యాణ్ అంటే ముందు నుంచి తమన్నా కి అభిమానం. శ్రీరెడ్డి పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో శ్రీ రెడ్డితో చెడింది. అప్పుడు శ్రీ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలతో ఫేమస్ అయింది తమన్నా. తర్వాత జనసేన నుంచి మంగళగిరిలో పోటీకి దిగాలని చూసింది. కానీ, వామపక్షాలతో పొత్తులో భాగంగా మంగళగిరి సీటును పవన్ కమ్యూనిస్టులకు ఇచ్చేశారు. దీంతో తమన్నా ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగింది. 47 ఓట్లు కూడా సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది.