Home Entertainment Cinema

బిగ్ బాస్ లో ఆ 10మంది కంటిస్టెంట్ల పై క్లారిటీ…!

SHARE

నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌-3పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
మొత్తం 15మంది కంటెస్టెంట్స్‌ పాల్గొననున్న ఈ షోలో హౌజ్‌లో ఎవరెవరు ఉండబోతునన్నారన్న దానిపై కొంత క్లారిటీ వచ్చింది. ఈసారి షోలో తీన్మార్ సావిత్రితోపాటు ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి, నటి హేమ, వరుణ్‌ సందేశ్‌, ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్‌ జాఫర్‌, ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌,ఫన్ బకెట్ ఫేమ్ మహేశ్ ఈ షోలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ లో ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది తీన్మార్ ఫేమ్ యాంకర్ సావిత్రి అలియాస్ శివజ్యోతి.ఇన్‌స్టాగ్రామ్‌లో సావిత్రి పోస్టు చేసిన ఓ వీడియోలో తాను బిగ్‌బాస్‌-3లో పాల్గొంటున్నట్టు తెలిపింది. వెంటనే ఆ వీడియో పోస్టు ని డిలీట్ చేసింది. మీడియాలో కేరాఫ్ కాంట్రవర్సీగా పేరు తెచ్చుకున్న TV9 జాఫర్ బిగ్ బాస్ 3 కి సెలక్టయ్యాడు. గత సీజన్ లో కూడా TV9 నుంచి రిపోర్టర్ దీప్తి బిగ్ బాస్ 2 కి సెలక్టయ్యారు. TV9 లో ముఖాముఖి పేరుతో సెలబ్రిటీస్ ని ఇంటర్యూ చేస్తూ ఇరిటేట్ చేసి నిజాలు రాబట్టడం జాఫర్ స్టైల్. ఇక జాఫర్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ ఎన్నికాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలుస్తుందో చూడాలి.

ఇక జాఫర్ తో పాటు ఫన్ బకెట్ ఫేమ్ మహేశ్ విట్టా కూడా సెలక్ట్ అయ్యారని తెలుస్తుంది. కమెడియన్ గా చిత్తూరు,కడప యాసలో కడుపుబ్బ నవ్విస్తాడు మహేశ్. కృష్ణార్జున యుద్దం తర్వాత సినిమా చాన్స్ లేవి లేవు మహేశ్ కి. వీరితో పాటు హీరో వరుణ్ సందేశ్ వైఫ్ వితిక షేరు కి కూడా చాన్స్ దక్కిందట. అప్పట్లో ఫేక్ వార్తతో బాగా ఫేమస్ అయింది వితిక. ఆత్మహత్య చేసుకుని ఆస్పత్రిలో ఉన్న వేరే మహిళని వితిక పేరుతో ఆత్మహత్య కి పాల్పడిందంటూ ట్రోల్ చేయడంతో అప్పట్లో భార్య,భర్త లిద్దరు మేంకాదు అంటూ వివరణ కూడా ఇచ్చారు. ఇప్పటికే వరుణ్ సందేశ్ కూడా ఈ షోకి ఎంపికయ్యారు.

ఈ షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని , లైంగికంగా వేధించారని జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఈరోజు జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు.