Home Women Recipes

వ‌యాగ్రా వాడుతున్నారా.. స్కిన్ క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంది జాగ్ర‌త్త‌!

SHARE

స‌ర‌స స‌ల్లాపాల్లో ఏవ‌న్నా బ‌ల‌హీన‌త‌లంటే బూస్ట్‌లా బూస్ట‌ప్ ఇచ్చేందుకు శృంగార‌ప్రియుల‌కు అనుకోని వ‌రంలా అందుబాటులోకి వ‌చ్చింది వ‌యాగ్రా. ఏ ముహూర్తాన ఇది మెడిక‌ల్ షాపుల్లోకొచ్చిందోగానీ ఓ త‌ల్నొప్పి టాబ్లెట్ కొనుక్కొచ్చినంత ఈజీగా వ‌యాగ్రా కొని వాడేస్తున్నారు. మిగిలిన మందుల‌కంటే వ‌యాగ్రా త‌యారు చేసే కంపెనీల‌కు కూడా దీనికున్న డిమాండ్‌తో బాగానే గిడుతోంది.

వ‌యాగ్రా వాడుతున్నారా.. స్కిన్ క్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంది జాగ్ర‌త్త‌!
శృంగారంలో విశ్వ‌రూపం చూపించే ఆరాటంలో ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ‌యాగ్రా వాడేస్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటాయ‌ట‌. వ‌యాగ్రా మీద కొన్ని ప్రికాష‌న్స్ ఎలాగూ ఉంటాయ‌నుకోండి. అవి కాకుండా వేరే ర‌క‌మైన స‌మ‌స్య కూడా ఉంద‌ని క‌నిపెట్టిన ఎక్స్‌ప‌ర్ట్స్ బీ కేర్‌ఫుల్ బ్ర‌ద‌ర్స్ అంటూ వార్న్ చేస్తున్నారు. వాడేముందు ఓసారి డాక్ట‌ర్‌ని క‌న్స‌ల్ట్ చేయ‌డం బెట‌రంటున్నారు. ఏదో సీక్రెట్‌గా కొని జేబులో పెట్టేసుకునేదానికి ఈ డాక్ట‌ర్‌గోలేంట‌నుకుంటున్నారా. అయితే కాస్త డెప్త్‌కెళ్లి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో స్ట‌డీ చేయాల్సిందే.

ఎప్పుడ‌న్నా అయితే ఓకేగానీ రిపీటెడ్‌గా వాడితే మాత్రం వ‌యాగ్రాతో స్కిన్ క్యాన్సర్ వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ట‌. వ‌యాగ్రాలో ఉండే సిడెన్‌పిల్ అనే డ్ర‌గ్ క్యాన్స‌ర్ కార‌క‌మ‌వుతుంద‌ని బోలెడంత రీసెర్చి చేసి క‌నిపెట్టారు జ‌ర్మ‌నీకి చెందిన ట్యుబెంజిన్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు. వ‌యాగ్రాలోని సిడెన్‌పిల్ మ‌నుషులు, జంతువుల్లో ఉండే మాలిగ్నెంట్ మెల‌నోమా అనే క‌ణాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ట‌. అంద‌రిలో కాక‌పోయినా కొంద‌రిలో ఇది స్కిన్ క్యాన్స‌ర్‌కి దారితీసే ప్ర‌మాద‌ముంద‌ని చెబుతున్నారు. సో..మొహ‌మాటాల‌కు పోకుండా వాడేముందు ఓసారి డాక్ట‌ర్‌ని అడిగితే మంచిదేమో.