Home News Stories

దత్తన్న శకం ముగిసిందా…?

SHARE

బీజేపీ లో ఇక దత్తాత్రేయ శకం ముగిసినట్టేనా…. ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని దశాబ్దాలుగా పార్టీ, సంఘ క్షేత్రాలకు సేవలందించిన దత్తన్న ఇక తెరమరుగు అయినట్టేనా… గత కొన్ని ఏళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి బరిలో నిలుస్తున్న దత్తాత్రేయ ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయినట్టేనా… కిషన్ రెడ్డి కి టికెట్ ఇచ్చి ఆయనను పార్టీ హై కమాండ్ పక్కన పెట్టి నట్టేనా అన్నది ఇప్పుడు తెలంగాణ బీజేపీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది…

దత్తన్న అంటే నేనున్నాను అని పలికరించే బండారు దత్తాత్రేయ ఎపిసోడ్ బీజేపీ లో ముగిసినట్టే…తన జీవితం అంత సంఘ్ పరివార క్షేత్రాలకే ఇచ్చిన ఆయన ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయినట్టే ననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ ను ఆయనకు కాదని కిషన్ రెడ్డి కి ఇవ్వడం తో ఇక పార్టీ ఆయన ను పక్కన పెట్టినట్టే ననే మాట పార్టీ లో వినిపిస్తోంది… అయన టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు… పార్టీ టికెట్ తనకే ఇస్తుందని… తానే పోటీ చేస్తానని చెబుతూ వచ్చాడు… నియోజక వర్గం లో విరివిగా కార్యక్రమాలు కూడా నిర్వహించారు… రెగ్యులర్ గా సభలు ,సమావేశాలు ఏర్పాటు చేశారు… కానీ పార్టీ హై కమాండ్ ఆయనను కరుణించలేదు… లష్కర్ టికెట్ ను ఆయనకు ఇవ్వలేదు…

దత్తాత్రేయ పైన పార్టీ ఢిల్లీ పెద్దలు గుస్సాగా ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది… ఎదో జరిగింది కాబట్టే ఆయనను మోడీ మంత్రి పదవి నుండి తప్పించారనే పార్టీ వర్గాలు అంటున్నాయి… అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన అడిగిన వారికి టికెట్ ఇవ్వలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా దత్తాత్రేయ కి సికింద్రాబాద్ తో విడదీయరాని బంధమే ఉన్నట్టు చెప్పొచ్చు…అక్కడి నుండి గెలిచే కేంద్ర మంత్రి అయ్యారు… తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు… గెలిచిన ఓడిన ఆయన ఆ నియోజవర్గాన్నే పట్టుకొని తిరిగాడు.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కిల్లి కొట్టు ఓపెనింగ్ కూడా దత్తాత్రేయ వెళ్ళేవాడు… నియోజక వర్గం కలియ తిరిగే వాడు… గల్లి గల్లి లో ఆయన గుర్తు పట్టె వారు చాలా మందే ఉంటారు…వయస్సు పై బడ్డ ఆయన నియోజకవర్గం లో తిరగడం మాన లేదుతాజా పరిణామం.తో దత్తాత్రేయ ఏ విదంగా స్పందిస్తారో చూడాలి… . పార్టీ హై కమాండ్ ఆయన భవిష్యత్ పై హామీ ఇస్తుందా… ఆయన సేవలను మరో రకంగా ఉపయోగించుకుంటుందా చూడాలి..ఇప్పటికే ఆయన అనుచరులు ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి మద్దత్తు గా ప్రచారం చేస్తారా… లేక తనను పక్కన పెట్టిందని దూరంగా ఉంటారా చూడాలి… అందరిని కలుపుకుపోయే కిషన్ రెడ్డి దత్తన్న మద్దతు ఈజీగానే కూడగడతారనే టాక్ నియోజకవర్గంలో నడుస్తుంది….