Home News Politics

బాలకృష్ణను చంపేసింది వికీపీడియానా…గూగుల్ ఆ….

SHARE

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్త.. నందమూరి అభిమానులకు ఆగ్రహం కలిగిస్తుంది. అవును మరి నందమూరి బాలయ్య వికీపీడియా కావాలని గూగులమ్మని అడిగితే షాకింగ్ వివరాలు బయటపెట్టింది. ఇంటర్నెట్ యుగంలో తరుచూ తప్పులు దొర్లటం అపుడప్పుడూ చూస్తూనే ఉన్నాం.కాని సడన్ గా నందమూరి నటసింహం బాలకృష్ణను చంపేసింది వికీపీడియా.

గూగుల్‌లో నందమూరి బాలకృష్ణ పేరుతో ఉన్న వికీపీడియాలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచారు. అపుడెప్పుడో 1913లో బాలయ్య పుట్టాడంటా. అది ఎక్కడో అర్సికెరెలో అది కూడ ఆయన తండ్రిగారు ఎన్టీరామారవు 1923లో జన్మించకముందే ఇక 1995లోనే బాలయ్య మరణించాడంటు కూడా రాసేసింది వికీపీడియా. ఇక బాలయ్యకు తన భార్య వసుంధరతో జయలక్ష్మి,సత్యవతి అనే భార్యలు ఉన్నట్లు కూడా రాసేసింది. అంతేకాదు ఆయన బెంగుళూరులో మరణించినట్టుగా ప్లేస్ కూడా డిసైడ్ చేసేశారు.

దీంతో వికీపీడియాలో బాలయ్య భర్త్ డెట్ ల గురించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవ్వడంతో ఆయన ఫాన్స్‌ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇంతకి తప్పు ఎక్కడ జరిగిందంటే అసలు మనం ఏదన్న సమాచారం కావాలని గూగుల్ లో వెతికితే ఆ విషయం ఏయే సైట్లలో ఉంది అది మనకు వెతికి చూపిస్తుంది. ఇక ఒకే పదంతో వెతికితే దానికి రిలేటెడ్ గా ఉన్నా అన్ని విషయాలను రివిల్ చేస్తుంది. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే మనకు బాలకృష్ణ అనగానే నందమూరి బాలకృష్ణ ఒక్కడే తెలుసు కాని గుగూల్ తల్లి అలాకాదు కన్నడ సినిమా రంగంలోని టీ.ఎన్ బాలకృష్ణకి సంభందించిన వివరాలును కూడా తన సెర్చ్ ఇంజిన్ లో పొందుపరిచి ఉంచుకుంటుంది. ఆ ఇద్దరికి సంభందించిన వివరాల్లో సారుప్యత ఉండటంతో అసలు చిక్కు అక్కడ వచ్చి పడింది. ఇలా ఇద్దరికి సంభందించిన వివరాలను మిక్స్ చేసి గూగుల్ చూపించడంతో విషయం తెలియక అంతా అవాక్కయ్యారు.

ఏ చిన్న పనికైన గూగుల్ మీద డిపెండ్ అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి షాకులు అప్పుడప్పుడు ఇస్తునే ఉంది గూగుల్ తల్లి. బుర్రలకు కాస్త పదును పెట్టకుండా గూగుల్ చూసుకుంటుందిలే అనుకుంటే ఇదిగో ఇలా తప్పులో కాలేయక తప్పదు.