Home Videos

వర్మ దెయ్యాల ప్రభావం జనం మీద ఉంటుంది: బాబు గోగినేని

వర్మ దెయ్యాల ప్రభావం జనం మీద ఉంటుంది: బాబు గోగినేని

SHARE

పాపులర్ దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి హేతువాది, మానవతావాది బాబు గోగినేని నోరు విప్పారు. వర్మ సినిమా ఒకే ఒక చిత్రం క్షణ క్షణం చూశానని అన్నారు. చక్కటి దర్శకుడని అన్నారు. గ్యాంగ్ స్టర్ చిత్రాలు తీశారని అన్నారు.

వర్మ తనకు నచ్చినట్లు తీస్తారని, ప్రేక్షకులకోసం కాదని అన్నారు. ఆర్ట్ ఫార్మ్ అయిన సినిమాని అయన తనకు నచ్చినట్లు తీయడాన్ని తప్పుపట్టడానికి లేదన్నారు. వర్మ తీసే దెయ్యాల చిత్రాల వల్ల మాత్రం నష్టం ఉంటుందని అన్నారు. సినిమాల ప్రభావం మాత్రం జనం మీద ఉంటుందన్నారు. ఇతరులకు హాని కలగకుండా ఎవరు ఏమైనా చేయవచ్చని అన్నారు.