Home Entertainment Cinema

అరవింద లో అమితాబ్ ?

SHARE

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ ఎక్స్ పర్టేషన్స్ తో వస్తున్న మూవీ ‘అరవింద సమేత’ . ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ అకాల మరణంతో కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడినా ఆక్టోబర్ 11 రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతోమళ్ళీ షూటీంగ్ వేగం పుంజుకుంది అయితే ఈ మూవీకి సంభందించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అరవింద సమేతలో ‘బిగ్ బీ అమితాబ్’ ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నరన్న న్యూస్ ఫ్యాన్స్ మరింత ఆనందానికి గురి చేస్తుంది. ఆడియో లేదా ప్రీ రిలీజ్ త్వరలో ప్లాన్ చేయబోతున్న ఈ సినిమాకి సంభందించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఆ ఈవెంట్ లోఎనౌన్స్ చేయనున్నరని మూవీ యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్.

ఇప్పటికే చిరు మూవీ ‘సైరా’ లొక ఇంపార్టెంట్ రోల్ కనిపిస్తున్న బిగ్ బీ అరవింద సమేత మూవీలో ఒక స్పెషల్ క్యామియో రోల్ లో కనిపిస్తారని టాక్. ఇది నిజమేనా అనే నిర్ధారించే అవకాశం ఇప్పటికిప్పుడు లేదు కానీ త్వరలోనే తేలిపోతుంది. ఇంతకు ముందు నాగర్జున మనం సినిమాలో కూడా స్పెషల్ రోల్ లో కనిపించిన బిగ్ బీ అమితాబ్ తెలుగు సినిమాల్లో ఈ మధ్య తలుక్కున మెరుస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాం పై ఇప్పటికె భారీ ఎక్సెపెక్టేషన్స్ఉన్నాయి. దసరా కానుకగా ‘అరవింద సమేత’ కాసుల వర్షం కురిపించడం ఖాయం అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.